1 గ్లాసు తాగితే చాలు ఎంతటి భారీ పొట్ట అయినా, తొడల దగ్గర కొవ్వు అయినా కరిగిపోతుంది
Apple Weight Loss Home remedies In Telugu : ఈ మధ్య కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని ఉండటం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు అలాగే పొట్ట బాగా పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. నెల రోజులు పాటు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక చిన్న ఆపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి. ఆ తర్వాత అర అంగుళం అల్లం ముక్కను తీసుకొని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిలో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, రెండు స్పూన్ల యాపిల్ తురుము వేయాలి.
ఆ తర్వాత గ్లాస్ నిండా నీటిని పోసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దాంతో పొట్ట తగ్గి కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ అవుతుంది.
ఈ డ్రింక్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి మరియు అధిక బరువును తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగి అధిక బరువు సమస్యను తగ్గించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.