Movies

సమ్మోహనం హీరోయిన్ ‘అధితిరావు హైదరీ’ భర్త ఎవరో తెలుసా?

అదితిరావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు సమ్మోహనం చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. సుధీర్ బాబు హీరో. ఇటీవలే ఈ సినిమా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈమె తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈమె మన తెలుగమ్మాయే. స్వయానా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవటం విశేషము. తాజాగా హైదరీ సమ్మోహనం సినిమాలో ‘ఓచెలి తారా’ అనే పాట పాడింది. గొందులో మాధుర్యం చూసి అందరూ అవాక్కయ్యారు. హీరోయిన్ గానే కాదు.

చక్కని గాయనిగా కూడా ఆమె ఢోకాలేదని అంటున్నారు. ఈమె ఇదివరకే ఏఆర్ రెహ్మాన్ సారథ్యంలో వచ్చిన ‘వాన్ వరువాన్’ పాటను పాడి అందరి హృదయాలను కొల్లగొట్టింది. హైదరీకీ గాత్రం ఆమె తల్లి నుంచి వచ్చింది.అదితి రావు హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించారు. ఈషాన్ హైదరీ, విద్యారావు ఈమె తల్లిదండ్రులు. బాల్యం విద్యాభాస్యం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.

ఈమె తల్లి విద్యారావు ప్రముఖ హిందూస్థానీ సంగీత విధ్వాంసురాలు. ఆమెను చూసే పాటలు పాడడం నేర్చుకొని మొదట సింగర్ గా రాణించింది. అదిథికి తెలుగు బాగా వచ్చు. మొదట సింగర్ గా హిందీ, తమిళంలో పాటలు పాడింది. 2006లో మళయాళంలో వచ్చిన ‘ప్రజాపతి’ మూవీ ద్వారా ఈమె సినిమాల్లోకి ప్రవేశించింది.

2011లో సుధీర్ మిశ్రా తీసిన ‘యే శాలి జిందగీ’ మూవీ నటనకు హైదరీకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో నటనకు స్క్రీన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. చాలా హిందీ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు పోహించింది. 2011లో వచ్చిన రాక్ స్టార్ సినిమా అధితికి మంచి పేరు తీసుకొచ్చింది. 2014లో వచ్చిన కూబ్ సూరత్ కూడా పేరు తెచ్చింది.

2016లో వచ్చిన వాజీర్ మూవీ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగింది. 2018లో భూమి అనే సైంటిఫిక్ చిత్రంలో నటించి మెప్పించింది.
ఇక అదిథి రావు పెళ్లి అయ్యాక కూడా హీరోయిన్ గా రాణిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. ఆమె 2009లో సత్యదీప్ మిశ్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఈ బాలీవుడ్ టెలివిజన్ యాక్టర్ ను పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటోంది. తాజాగా అదిథి ‘సమ్మోహనం’ చిత్రంలో నటించి మెప్పించింది. తన 21 వ ఏటనే పెళ్లి చేసుకున్నా ఇంకా అదిథి సినిమాలను మాత్రం వదలకుండా చేస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.