Kitchenvantalu

ఈ జ్యూస్ తాగితే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య ఉండదు

Anemia Home Remedies In Telugu : ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వారి నుంచి పెద్దవారి వరకు వేధించే సమస్యలలో రక్తహీనత సమస్య ఒకటి. ఈ సమస్య ప్రారంభంలో నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు చాలా తొందరగా బయటపడటానికి ప్రయత్నం చేయాలి.

మనం ఆహారంలో మార్పులు చేసుకుంటే రక్తహీనత సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే జ్యూస్ తాగితే చాలా తొందరగా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే జ్యూస్ రెండు వారాల పాటు తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.

ఒక దానిమ్మ పండును తీసుకుని గింజలను సపరేట్ చేయాలి. ఆ తర్వాత ఒక గ్రీన్ ఆపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మూడు అంజీర్లను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టాలి. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టిన యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, నానబెట్టిన అంజీర్, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Anjeer benefits
ఇలా తయారైన జ్యూస్ లో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

ఈ జ్యూస్ లో తీసుకున్న అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని సమయాన్ని కేటాయించి ఈ జ్యూస్ తయారుచేసుకొని తాగి రక్తహీనత సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.