కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి
Dark lips home remedies in telugu : పెదాలు నల్లగా లేకుండా గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి. అయితే ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.
అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రాత్రి సమయంలో ఒక బౌల్ లో 10 బాదం పప్పులను నీటిని పోసి నానబెట్టాలి. మరొక బౌల్ లో పావు స్పూన్ కుంకుమ పువ్వు, నాలుగు స్పూన్ల రోజ్ వాటర్ పోసి నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం నానిన బాదం పప్పు తొక్క తీసి మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసి పాలను సపరేట్ చేయాలి. ఒక బౌల్ లో కుంకుమ పువ్వును నానబెట్టుకున్న రోజ్ వాటర్ ను వేయాలి. ఆ తర్వాత 3 స్పూన్ల బాదం పాలు, 3 స్పూన్ల ఆలోవెరా జెల్, ఒక స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మిక్సీ చేస్తే లిప్ క్రీమ్ తయారవుతుంది.
ఈ లిప్ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ క్రీమ్‌ను రోజుకు రెండు నుంచి మూడుసార్లు పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఈ హోమ్ మేడ్ లిప్ క్రీమ్ ను వాడటం వల్ల పెదాల పగుళ్లు నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ పెదాలు పగలకుండా కూడా ఉంటాయి. నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.