సూపర్ స్టార్ కృష్ణ హీరో కాకముందు జూనియర్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో చేసారో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిల్చిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సంచలనాలు సృష్టించి వీర లెవెల్ల్లో మోత మోగించాడో చెప్పలేం. అయితే యితడు సూపర్ స్టార్ అయ్యాడంటే దాని వెనుక ఓ వ్యక్తి తపన,శ్రమ దాగి ఉన్నాయి. చిన్న చిన్న పాత్రలు కూడా వేసిన కృష్ణను వెండితెరమీద హీరోగా చూసుకోడానికి , హీరోగా చేయడానికి మహేష్ బాబు నానమ్మ నాగరత్నమ్మ ఎంత శ్రమించారో, ఎన్ని అవస్థలు పడ్డారో తెలియదట.తన కొడుకుని వెండితెర మీద చూసుకోవాలని ఆమె పడ్డ తపన అంతా ఇంతా కాదు. నిజానికి సినిమాల్లోకి రావాలని అందరికీ ఉంటుంది. తీరా వచ్చాకే అసలు కష్టాలు మొదలవుతాయి. సేమ్ కృష్ణ గారికి కూడా అవి తప్పలేదు. చిన్నప్పటి నుంచి కృష్ణకు సినిమాల పిచ్చి. కానీ అందులోకి ఎలా రావాలో తెలీదు. ఎక్కడో బుర్రిపాలెం లో ఉంటూ , చెన్నై వచ్చి చక్రం తిప్పాలంటే అయ్యే పనా?
ఇక సినిమాల్లోకి రాకముందు మురళీమోహన్, కృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ . ఓసారి ఈయన చదివే కాలేజీకి డైరెక్టర్ తిలక్ యన్యవల్ ఫంక్షన్ వచ్చారట. అప్పుడు వేదిక మీది నుంచి కిందికి చూస్తే, మురళీమోహన్,కృష గారు పక్కపక్కనే కూర్చున్నారట. అందులో కృష్ణ గారిని తిలక్ గారు తదేకంగా చూస్తూ, స్టేజిమీదికి పిలిచి, నీ పేరేంటి అని అడిగారట.
దీంతో కృష్ణమూర్తి అండి అని చెప్పారట. సినిమాల్లో నటిస్తావా అని తిలక్ గారు ఒక్కసారిగా అడిగేసరికి, ఏమిచెప్పాలో ఏదో చెప్పేసారు. అయితే నేను కబురు పంపుతానని ఎడ్రెస్ తీసుకున్నారు. ఆ విధంగా చెప్పిన ఏడాదికి ఆడిషన్స్ కి రమ్మని కబురు వచ్చిందట. ఆడిషన్స్ కి వెళ్లి వచ్చాసరే తప్ప ఏ అవకాశం రాలేదు. వెళ్ళి వచ్చాక సినిమాల మీద మరింత ఆసక్తి పెరిగిపోగా, తల్లికి విషయం చెప్పాడు.
ఆమె తన భర్తకు ఏదో చెప్పుకుని , కొడుకు కూడా మద్రాసు వచ్చింది. చిన్న గదిలో ఇద్దరూ ఉండేవారు. ఆవిడ వంట చేసి పెడుతుంటే,సినీ ఛాన్సల కోసం కృష్ణ ట్రై చేసేవారు. తిరిగి తిరిగి విసిగిపోయిన కొడుకు బాధను తట్టుకోలేకపోయిన నాగరత్నమ్మ గారు సినిమా ఆఫీసులకు వెళ్లి,మా అబ్బాయి అందంగా ఉంటాడు, ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలాడేవారట. అయినా ఫలితం దక్కలేదు.
అలా తిరుగుతుంటే చివరకు జగ్గయ్య గారు కనిపించారు. ఆయనతో దూరపు బంధుత్వం ఉండడంతో అయన దగ్గరికి నాగరత్నమ్మ గారు వెళ్లి,కృష్ణ గారి ఫోటోలు అవీ ఇచ్చి వేషం కోసం అడిగారు.అయితే అదేసమయంలో జగ్గయ్య సమర్పణలో స్వాతంత్ర్యోద్యమానికి సంబందించిన పదండి ముందుకు సినిమా తీస్తున్న నేపథ్యంలో అందులో అవకాశం ఇమ్మని ఆమె వేడుకున్నారు. దాంతో ఆ మూవీలో ఓ చిన్న రోల్ దక్కింది కృష్ణ గారికి. ఆసినిమాలో పది మంది మధ్యలో కేవలం జెండా పట్టుకుని నిలబడతారు అంతే.
మనసు అంగీకరించకపోయినా ఆ రోల్ చేసారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి నటించిన కులగోత్రాలు మూవీలో అక్కినేని ఓ పెళ్ళికి వెళ్తారు. ఆ పెళ్ళిలో పెళ్ళికొడుకు రోల్ కృష్ణ గారిదే. ఇలా వెనక నిలబడి వుండే పాత్రలు రెండేళ్లు చేసాక, ఆదుర్తి సుబ్బారావు గారి తేనెమనసులు మూవీతో హీరోగా వచ్చి ఎన్నో రికార్డులకు కృష్ణగారు కేంద్ర బిందువయ్యారు.