Healthhealth tips in telugu

ఈ మసాలా దినుసులో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

Health benefits of black stone flower: దగడ పువ్వు అనేది ఒక మసాలా దినుసు. దీనిని ఇంగ్లీష్ లో ‘బ్లాక్ స్టోన్ ఫ్లవర్’ అంటారు. ఈ మసాలా దినుసు గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో ఈ మసాలా దినుసు వాడకం బాగా పెరిగింది. బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
Black stone flower
Black stone Flower ని ఎక్కువగా మసాలా వంటలలో వాడుతూ ఉంటారు. ఇది గోధుమ మరియు నలుపు రంగులో ఉండే సుగంధ ద్రవ్యం. ఇది పొడిగా ఉంటుంది. అలాగే బలమైన మట్టి వాసనను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీలిథియాటిక్ లక్షణాలు ఉండుట వలన కిడ్నీలో రాళ్ల నివారణకు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నివారణకు సాంప్రదాయ వైధ్యంలో ఉపయోగిస్తారు.
Urine Infection Home Remedies In Telugu
అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకులు మొదలైన వివిధ పరిస్థితుల వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
gas troble home remedies
జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచడంలో సహాయపడి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి సహాయ పడుతుంది. ఈ మసాలా శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని పెంచి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మసాలాలో యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

దురద, పిగ్మెంటేషన్ వంటి చర్మవ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ పేస్ట్ ని రాస్తే తొందరగా తగ్గుతాయి. బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ని నీటితో లేదా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు,ఉబ్బసం తగ్గటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.