రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల దృఢత్వం పెరిగి నొప్పులు తగ్గుతాయి
Joint Pains powerful natural remedy : కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే తొందరగా తగ్గవు. ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చాక వచ్చే నొప్పులు ఈ రోజుల్లో 30 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించుకోవటానికి ఒక ఆయిల్ తయారుచేసుకుందాం. ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కీళ్లనొప్పులు,మృదులాస్థి సమస్యలు తగ్గి కీళ్ల దృఢత్వం పెరుగుతుంది. కీళ్ల మధ్య వశ్యత బాగుంటుంది. కీళ్ళు మరియు ఎముకలు బలంగా మారతాయి. మొదటగా 5 బిరియాని ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. బీర్యాని ఆకులో ఉండే బలమైన అనాల్జేసిక్ ప్రభావం నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది.
ఆ తర్వాత రెండు రోజ్మేరీ కొమ్మలను తీసుకొని ఆకులుగా విడతీయాలి. రోజ్మేరీ శతాబ్దాలుగా రుమాటిజం చికిత్సలో సహాయపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌పై ప్రత్యేకించి మంచి ప్రభావాన్ని చూపుతుంది, కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు తగ్గుతాయి. ఎండిన రోజ్మేరీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు,
ఈ ఆకులను కీళ్ల నొప్పులకు తిరుగులేని సహజ నివారణగా చెప్పుతారు. ఆ తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన ఆర్థరైటిస్‌లో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 50 Ml ఆలివ్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకుల ముక్కలు,రోజ్మేరీ ఆకులను వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 30 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నూనె చల్లారిన తర్వాత సీసాలో వడపోసి నిల్వ చేసుకోవాలి. Rheumatism, gout and osteoporosis వంటి సమస్యలకు ఒక వరం వంటిది అని చెప్పవచ్చు. ఈ నూనె కీళ్ళు మరియు ఎముకలపై ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.