Healthhealth tips in telugu

ఈ పిండితో చపాతీ తింటే బరువు తగ్గటమే కాకుండా…మరెన్నో ప్రయోజనాలు…

Weight Loss Chapati In telugu : ఇటీవల కాలంలో మనలో చాలామంది బరువు తగ్గటానికి రాత్రి సమయంలో భోజనం మానేసి గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటున్నారు. గోధుమ పిండి కాకుండా వేరే పిండితో చపాతీలు చేసుకుని తింటే చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే గోధుమపిండిలో gluten అనే పదార్థం ఉంటుంది.
sajjalu beenfits
దీని కారణంగా గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సజ్జల వాడకం చాలా ఎక్కువ అయింది. సజ్జ పిండితో చపాతీ చేసుకొని తింటే ప్రోటీన్ సమృద్దిగా అందుతుంది. అలాగే Gluten అనేది అసలు ఉండదు. ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. అంతేకాకుండా ఆలస్యంగా జీర్ణం అవుతుంది.
oats benefits
ఒట్స్ పిండితో చపాతీ చేసుకొని తింటే కార్బోహైడ్రోట్లు శరీరానికి సమృద్దిగా అంది రోజంతా అలసట లేకుండా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా ఓట్స్‌లో గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
quinoa seeds
క్వినోవా పిండితో చపాతీ చేసుకొని తింటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ మరియు తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు అందుతాయి. క్వినోవాను పోషకాల పవర్‌హౌస్‌ అని చెప్పవచ్చు. దీనిలో ఐరన్‌, అసంతృప్త కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

క్వినోవా పిండితో చేసిన చపాతీలు ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండేలా చేయటం వలన తొందరగా ఆకలి వేయదు. అంతేకాకుండా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. అలాగే Gluten అనేది అసలు ఉండదు. ఇప్పుడు చెప్పిన సజ్జ పిండి,క్వినోవా పిండి, ఒట్స్ పిండి ఈ మూడింటిని వారంలో రెండు సార్లు చపాతీ చేసుకొని తింటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/