ఒకే ఒక ఆకు రక్తహీనత,శారీరక బలహీనత, కీళ్ల నొప్పులు, కాల్షియం లోపం లేకుండా చేస్తుంది
Betel leaf Benefits in Telugu : మన భారతదేశంలో తమలపాకును ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్ని భారతీయ వేడుకలలో తమలపాకు కీలకమైన పాత్ర ను పోషిస్తుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ సి నియాసిన్ రిబోఫ్లావిన్ కెరోటిన్ విటమిన్స్,కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తమలపాకులను పేస్టుగా చేసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే తమలపాకు రసం తాగిన శరీరం లోపల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుకడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది శరీరంలో విషాలను బయటకు పంపుతుంది అలాగే తమలపాకు ఆకలి హార్మోన్లను పునరుద్ధరించి ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా చేస్తుంది. నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
తమలపాకులు యాంటీబయటిక్ ప్రభావాలు. కలిగి ఉండటంవల్ల దగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది . డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీకు కుదిరిన సమయంలో లేత తమలపాకు ఒకటి తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. తమలపాకుకు వేడి చేసే గుణం ఉండుట వలన ఎక్కువగా తినకూడదు. లిమిట్ గా తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.