Movies

చిరంజీవి చేసిన ఈ పనుల గురించి తెలిస్తే మెగాస్టార్ ఎందుకు అయ్యాడో అర్ధం అవుతుంది

స్వయం శక్తితో చిన్న స్థాయినుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ఎవరినీ నొప్పించని, అందరినీ మెప్పించే మృదు స్వభావి. ఇటు సినీ రంగం కావచ్చు, అటు రాజకీయ రంగం కావచ్చు ఏ రంగమైనా సరే, వివాద రహితుఁగిగా పేరొందిన చిరంజీవి రాజకీయ రంగంలో కాలుమోపి, ప్రజారాజ్యం స్థాపించి,అక్కడ నిలబడలేక కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేయడం అయన సున్నితత్వానికి నిదర్శనం.

ప్రస్తుతం రాజకీయ రంగానికి దూరంగా ఉంటున్న చిరంజీవి తన ఉన్నతికి తోడ్పడ్డ, సినీ రంగానికి పునరంకితం కావడం, అటు సినీ జనాన్ని , ఇటు ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. మూడు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్న చిరు తాను సంపాదించిన ప్రతిపైసా ప్రజలనుంచి వచ్చిందేనన్న సంగతి ఎన్నడూ మరిచిపోలేదని చెప్పాలి.

ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు లు అందుకు ప్రబల నిదర్శనం. భారీ ఎత్తున నిధులు వసూలు చేసి ఆ నిధులతోనే వాటిని ఏర్పాటుచేసాడని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ కోట్ల రూపాయల సొంత సొమ్ము వెచ్చించి, బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు నెలకొల్పారు.
ఎవ్వరి నుంచీ ఒక్క నయా పైసా కూడా సేకరించకుండా, తన వ్యక్తిగత సంపాదనలోంచే వెచ్చించి బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు స్థాపించినట్లు మెగాస్టార్ స్వయంగా ఓ ఇంటర్యూలో చెప్పారు కూడా.

రాష్ట్రంలోని ఇతర బ్లడ్ బ్యాంకు లతో పోలిస్తే తాము నామమాత్రపు ఫీజు వసూలు చేస్తున్నామని, ఎక్కువగా పేదలకు ఉపయోగ పడాలన్నా ఉద్దేశ్యంతో వీటిని స్థాపించినట్లు చిరు అప్పట్లోనే చెప్పారు. వీటిని పక్కన పెడితే చిరంజీవి చేసిన గుప్తదానాల సంగతి చాలామందికి అసలు తెలీదు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ నేరెళ్ల వేణు మాధవ్ తర్వాత అంతటి స్థాయికి వెళ్లిన హరికిషన్ కి ఆనారోగ్యం ఏర్పడి కిడ్నీ పాడైతే అతని భార్య కిడ్నీని అమర్చారు.

అయినా ఫలితం అంతగా లేకపోవడంతో రోజూ డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఉన్న డబ్బంతా ఖర్చయ్యి పోయి,దిక్కుతోచని స్థితిలో గల ఆ ఫ్యామిలీ పరిస్థితికి చిరు మానవతా దృక్పధంతో స్పందించారు. ఓ లక్ష రూపాయలు కవర్ లో పెట్టి హరికిషన్ కి పంపించారు. ఇదే కాదు ఇంకా కావలిస్తే అడగండి మొహమాట పడవద్దు అంటూ ఆ కవర్లో చిరు రాసారు.

ఇక చిరు మానవతా దృక్పధం ఎలాంటిదో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాక ఒక సంఘటన రుజువుచేసింది. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో తరతరాలుగా తీవ్ర వెనుకబాటుతనంతో ప్రజలు బాధ పడుతున్నారు. మిగిలిన గ్రామాలన్నీ అభివృద్ధి పధంలో దూసుకుపోతుంటే,సంపర మాత్రం వెనుకుబడివుంది. స్వయంగా చిరు ఆగ్రామాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులు చూసి చలించిపోయారు.

వెంటనే మూడు కోట్ల రూపాయలు కేటాయించి, వెంటనే ఓ స్కూల్ ఏర్పాటుచేసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని అధికారులకు సూచించారు. అప్పట్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెరిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరు అంతకన్నా వెనుకబడిన సంపరను కూడా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకే స్పాట్ లో మూడు కోట్లు దానం చేసి రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచాడు చిరు.