Movies

బాలయ్యతో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఆమె ఏ పరిస్థితిలో ఉందో తెలుసా?

విధి వైపరీత్యం నుంచి ఎవరూ తప్పించలేరని అంటుంటారు. అది మామూలు మనిషి కావచ్చు,స్టార్ హీరోలు కావచ్చు,సెలబ్రిటీలు కావచ్చు. ఎవరైనా సరే దీన్నుంచి తప్పించుకోలేరు. ఇక ఒకప్పుడు ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిన మంచి స్టార్ డమ్ సంపాదించుకుని, సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ పరిస్థితి అంత్యంత దయనీయంగా మారిపోయింది.

ఆమెకు వచ్చిన దుస్థితి చూస్తే ఎవరైనా సరే అయ్యో అనక మానరు. దీంతో కష్టాలు ఆమెను వెంటాడాయి. అయితే ఆమె ఏమి చేసిందనే వివరాల్లోకి వెళ్తే , ఆ హీరోయిన్ పేరు మోహిని. తన పిల్లికళ్ళతో అందరినీ అలరించిన ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ అయిన ఈమె తమిళ అమ్మాయి. తెలుగు , తమిళ, మలయాళ మూవీస్ లో నటించింది. మోహిని అసలు పేరు మహాలక్ష్మి. ఈమె తండ్రి శ్రీనివాసన్,తల్లి సుందరి. స్కూల్ డేస్ లోనే సినిమాలపై మోజులో ఆ రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కనేది.

అయితే ఆమె కలఫలించి మొట్ట మొదటిగా తమిళంలో ‘ఎర్రమన రోజవే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో యువరత్న బాలకృష్ణ సరసన ‘ఆదిత్య 369’ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది ఈ భామ. నటించిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఇక వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయింది. ఆమె నటించిన అన్ని భాషా చిత్రాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది. అయితే సినీ జీవితంలో మనకు తీకుండానే విరామం వస్తుంది.

ఇక మోహిని జీవితంలో కూడా పెళ్లి రూపంలో సినీ జీవితానికి బ్రేక్ పడింది. భరత్ అనే వ్యక్తితో మ్యారేజ్ అవ్వడంతో అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఎంతో హాయిగా ,సాఫీగా జీవితం సాగిపోతోన్న సమయంలో మోహినికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి కొడుకు పుట్టాక ఆమెకు నరాలకు సంబంధించిన వ్యాధి సోకింది.

ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె మంచాన పడింది. ఇక భర్తనుంచి విడాకులు తీసుకునేవరకూ ఆమె అనారోగ్యం చేరింది. మానసికంగా, శారీరకంగా కుంగిపోయి నానా కష్టాలు పడ్తున్న మొహినికి ఏమి చేయాలో పాలుపోలేదు. అయితే ఓ రోజు పనిమనిషి ఇచ్చిన సలహాతో ఆ దిశగా అడుగులు వేసింది.

స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోహిని అప్పటివరకూ సాంప్రదాయ బద్దంగా పూజలు, పునస్కారాలు చేస్తూ, సడన్ గా క్రైస్తవం తీసుకుని,పేరు కూడా మార్చేసుకుంది. తనలా జీవితంలో కష్టాలు పడిన వాళ్లకు తోడుగా నిలుస్తూ, వారికోసం ప్రార్ధనలు చేస్తూ, జీవనం సాగిస్తోంది. అందుకే జీవితంలో జరిగే కొన్ని ఘటనలు మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో,ఎటువైపుకి పరిస్థితులు దారితీస్తాయో అని అందుకే అంటారు మనవాళ్ళు.