రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?
ఒక్కో సినిమా విజయవంతం అయ్యాక అందులోని కొన్ని పాత్రలు జనహృదయాల్లో నిల్చిపోతే, ఆ పాత్ర నిజానికి తానే పోషించాల్సి ఉందని ఆ పాత్ర మిస్ అయినవాళ్లు చెప్పడం చూస్తుంటాం. తాజాగా రంగస్థలం మూవీలో కీలకమైన రామలక్ష్మి పాత్రకోసం మొదట అనుమప పరమేశ్వరన్ ని సంప్రదించారట. సమంత పోషించిన ఆపాత్ర గురించి మొదట్లో తనకే అవకాశం వచ్చిందని అనుపమ స్వయంగా వెల్లడించింది.
సాయి ధర్మ తేజతో కల్సి నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ వచ్చే శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో అనుపమ తాజాగా మీడియాతో మాట్లాడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘అ ఆ ‘సినిమాలో నటించేటప్పుడు తనకు త్రివిక్రమ్ తెలుగు నేర్పించారని అందుచేత భాషా ప్రోబ్లం లేదని ఆమె చెప్పింది.
ఇక డైరెక్టర్ కరుణాకరన్ రూపొందించిన ‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ చాలా బాగా తెరకెక్కించారని అనుమప చెప్పింది. ‘రంగస్థలం మూవీలో రామలక్ష్మి పాత్రకోసం మొదట నన్నే సంప్రదించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పాత్ర చేయలేకపోయాను. అయితే ఆ సినిమా విడుదలయ్యాక చూసాను. ఆ పాత్ర తాను మాత్రమే చేయగలను అన్నట్టుగా సమంత చాలా బాగా నటించింది.
ఇక ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ కి కూడా చెప్పాను. అంతేకాకుండా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా చాలా బావుంది. బాగా నటించారు. ఇలాంటి పాత్రలు చూసినపుడు నటిగా స్ఫూర్తి పొందుతాను’అని అనుమప వివరించింది.
అయితే తనకు తెలుగు అంటే ఏమాత్రం ప్రోబ్లం లేదని చెప్పిన అనుమప, అ ఆ సెట్లో అందరూ చక్కగా తెలుగు మాట్లాడేవారని, త్రివిక్రమ్ గారు ప్రతిపదానికి స్పష్టంగా అర్ధం వివరించి చెప్పడంతో సులువుగా తెలుగు నేర్చుకో గలిగానని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు.
ఇక రంగస్థలం లో రామలక్ష్మి పాత్రను అనుమప చేసి ఉంటే ఆమె ఓ రేంజ్ కి వెళ్లేదని, అయితే సమంత మాత్రం ఈ పాత్రకు హండ్రెడ్ పర్శంట్ న్యాయం చేసిందని చెప్పక తప్పదు.