బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీ తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
Weight Loss smoothie In Telugu : ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ముందుగా బరువు తగ్గాలి.
ప్రతిరోజు ఉదయం అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే స్మూతీ తీసుకుంటే చాలా తక్కువ సమయంలోనే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. రాత్రి సమయంలో ఒక గిన్నెలో ఐదు బాదం పప్పులు, రెండు వాల్ నట్స్ వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరసటి రోజు ఉదయం బాదం పప్పులు, వాల్నట్స్ పై తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి మూడు స్పూన్ల ఓట్స్ వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక యాపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ లో వేగించి పెట్టుకున్న ఓట్స్, ఆపిల్ ముక్కలు, తొక్క తీసిన బాదం, వాల్నట్స్, ఒక స్పూన్ అవిసె గింజలు, అర స్పూన్ మునగాకు పొడి, ఒక గ్లాసు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్మూతీ రెడీ అయినట్టే.
ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ రేటు పెరిగి క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఈ స్మూతీ తీసుకోవటం వలన ఈ సీజన్లో వచ్చే సమస్యలు ఏమి ఉండవు.
కాబట్టి కాస్త ఓపికగా ఈ స్మూతీ తయారుచేసుకొని తీసుకుంటే అలసట,నీరసం వంటివి ఏమి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ స్మూతీని చదువుకొనే పిల్లలకు ఇస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ స్మూతీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతగానో మేలును చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.