2020 లో ఎన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయో…?
2020 Telugu Cinema Hits and Flops :జన్మలో మరిచిపోలేని విలయతాండవం చేసిన 2020 సంవత్సరం ముగిసిపోయింది. కరోనా దెబ్బకు ఎన్నో రంగాలు కుదేలవ్వగా, సినిమా రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. నిజానికి 200 వరకూ సినిమాలు రిలీజవ్వాల్సి ఉంటె, కేవలం 49 సినిమాలే వచ్చాయి.
మహేష్ బాబు, బన్నీ, నితిన్, రవితేజ వంటి స్టార్ హీరోల మూవీస్ తప్ప మిగిలిన పెద్ద స్టార్స్ సినిమాలు రిలీజవ్వలేదు. మార్చి 19నుంచి ఆగిపోయిన థియేటర్లు డిసెంబర్ నుంచి తెరుచుకోవడం మొదలైంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఓటిటి లో పాతిక సినిమాలు వచ్చేసాయి. అందులో కొన్ని క్రేజీ మూవీస్, బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి.
సంక్రాంతికి వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ 150కోట్లు కలెక్ట్ చేసి బన్నీకి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. 140కోట్ల షేర్ తో మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ సెకండ్ ప్లేస్ లో నిల్చింది. నితిన్ నటించిన భీష్మ 27కోట్ల షేర్ తో మూడవ స్థానంలో నిలిచింది. ఇక తాజాగా డిసెంబర్ లో వచ్చిన సోలో బతుకే సో బెటర్ మూవీ 10కోట్లు షేర్ ఖాయమని అంటున్నారు. కరోనా తర్వాత ఇలా కలెక్షన్స్ రావడం గ్రేట్ అంటున్నారు.
దీంతో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే హిట్ మూవీస్ కింద లెక్కతేలాయి. విశ్వస్కెన్ నటించిన హిట్ మూవీ కూడా బాగానే పేరొచ్చింది. భారీ క్రేజ్ తో వచ్చిన డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం పొందాయి. ఎంతమంచి వాడవురా, జాను, అశ్వద్ధామ సినిమాలు ఆకట్టుకోలేదు. పలాస కొంచెం మంచి మూవీగా నిల్చింది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే మూవీ కాస్తంత పర్వాలేద నిపించింది.
మిగిలిన ఏ మూవీ కూడా ఆడలేదు. ఓటిటి లో వచ్చిన సినిమాల్లో భారీ మూవీస్ వి, నిశ్శబ్దం నిరాశ పరిచాయి. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, కలర్ ఫోటో, మిడిల్ క్లాడ్ మెలోడీస్, కృష్ణ అండ్ లీల, భానుమతి అండ్ రామకృష్ణ టాప్ 5గా నిలిచాయి. డర్టీ మూవీ కూడా హిట్ కొట్టింది. ఇక సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా మూవీ ఓటిటిలో కాసుల పంట పండించింది.