సుస్వాగతం సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?
suswagatham movie :ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రేమ పేరుతొ పిచ్చోళ్ళ మాదిరిగా తిరిగేవాళ్లకు గుణపాఠం చెప్పేలా తీసిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రఘువరన్ యాక్షన్ అదరగొట్టేసారు. 1998లో సూపర్ టెన్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఉంది. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సూపర్ హిట్ అవ్వడంతో అన్ని భాషల్లో రిలీజయింది.
అయితే తెలుగులో రీమేక్ చేయాలనీ ఆర్బీ చౌదరి అనుకున్నారు. శుభాకాంక్షలు మూవీ తీసిన భీమినేని శ్రీనివాసరావు దీనికి కరెక్ట్ అనుకుని ఆయన్ని పిలిపించి చేయమన్నారు. అప్పటికే సూర్యవంశం ఒప్పుకున్నారు. అందుకే రెండూ ఒకేసారి చేయాల్సి వచ్చింది. జెడి చక్రవర్తి, అబ్బాస్ ఇలా కొన్ని పేర్లు హీరో కోసం అనుకున్నారు.
అయితే ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో పవన్ గోకులంలో సీత చేస్తున్నారు. అక్కడి మేనేజర్ ద్వారా విషయం తెలుసుకుని పవన్ ని హీరోగా పెట్టుకోవాలనుకుని అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి మూవీ ప్రింట్ చూసే ఆర్బీ ఒకే చెప్పారు. చిరంజీవిని కల్సి విషయం చెప్పి, పవన్ కి కథ చెప్పడంతో ఒకే అయింది.
తమిళంలో చేసిన రాశి బిజీ కావడంతో తమిళ సూర్యవంశంలో చేసిన దేవయానిని తీసుకున్నారు. తమిళంలో చేసిన రఘువరన్ తెలుగులో కూడా ఈ పాత్ర చేసారు. చింతపల్లి రమణ మాటలు రాయగా, ఎస్ ఏ రాజ్ కుమార్ మ్యూజిక్. 1997 జులైలో పవన్ మూడవ సినిమా ఓపెన్ అయింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు.
ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్. సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజు నాడు సుస్వాగతం టైటిల్ ప్రకటించారు. విశాఖలో మేజర్ పార్ట్ తీశారు. హైదరాబాద్, అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేసారు. రఘువరన్ చితివద్ద ఏడిచే సీన్ కోసం పవన్ రెండు రోజులు ప్రిపేర్ అయ్యాడు. ఒక రోజంతా పస్తులుండడంతో నీరసం ఆవహించింది. ఆ సీన్స్ పండడంతో అందరూ అభినందించారు.
1998 జనవరి 1న రిలీజైన ఈ మూవీ యువతను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల అనుబంధం, స్నేహం, ప్రేమలో పొరపొచ్ఛాయలు, ఎమోషన్ ఇలా అన్నీ పండాయి. స్వచ్ఛమైన ప్రేమకోసం పవన్ తన నటనతో జీవించాడు. తండ్రి ప్రేమ, ప్రేయసి తిరస్కరణ మధ్య నలిగిపోతూ అత్యద్భుత నటన ప్రదర్శించాడు. ఇక దేవయాని కూడా తన క్యారెక్టర్ కి బాగా సూటయింది.
ప్రకాష్ రాజ్ సాడిస్ట్ నటనతో ఆకట్టుకోగా, అప్పటివరకూ విలన్ గా వేషాలు వేసిన రఘువరన్ ఈ మూవీలో మంచి స్నేహితుడు లాంటి తండ్రిగా నటించాడు. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి, ఆలయన హారతిలో .. సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్. ఈ మూవీతోనే పవన్ కి ఫాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. 45 సెంటర్స్ లో 50డేస్, 9సెంటర్స్ లో 100రోజులు ఆడింది. ఆరుకోట్ల షేర్ తెచ్చింది.