లవకుశ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Lava Kusa Full Movie :రామాయణ ఘట్టం తెలుగువారికి ఎంతో ఇష్టం. ఎన్నో సినిమాలు రామాయణ ఆధారంగా తెరకెక్కాయి. 1934 లోనే ఈస్టిండియా ఫిలిం కంపెనీ ఆధ్వర్యం సి పుల్లయ్య డైరెక్షన్ లో లవకుశ మూవీ రూపుదిద్దుకుని హిట్ అయింది. 21సాంగ్స్, 12పద్యాలూ ఉన్నాయి. పాటలను ప్రింట్ చేసి అమ్మడం ఈ మూవీతోనే స్టార్ట్ అయింది.
మళ్ళీ ఈ సినిమా తీయాలన్న కోరిక 24 ఏళ్లతర్వాత లలితా శివజ్యోతి అధినేత శంకరరెడ్డికి కలిగింది. ఎందుకంటే అంతకుముందు ఆయన తీసిన చరణదాసి మూవీలో ఎన్టీఆర్ , అంజలి దేవి సీతారాములుగా జస్ట్ కన్పిస్తారు. దాంతో వీరిద్దరితో లవకుశ తీయాలన్న నిర్ణయానికి వచ్చారు. 1952లో ఆన్ అనే హిందీ మూవీ కలర్ లో వచ్చింది.
ఆ సినిమా ప్రోసెసింగ్ లండన్ లో చేయించారు. తన పరిమిత వనరులోనే కలర్ లో లవకుశ తీయాలని శంకర్ రెడ్డి భావించారు. డైరెక్ట్ చేయడానికి సి పుల్లయ్య ఒకే చెప్పారు. ఎన్టీఆర్, నాగయ్య, అంజలి దేవి తదితర నటీనటులతో లవకుశ కు సెలెక్ట్ అయ్యారు. సదాశివ బ్రహ్మం స్క్రిప్ట్ వర్క్ ప్రిపేర్ చేసారు. పది పద్యాలు,8సాంగ్స్ ఈయనే రాసారు.
సముద్రాల 7సాంగ్స్, కొసరాజు 3పాటలు రాసారు. దువ్వూరి రామిరెడ్డి, కంకటి పాపారాజు రెండు పద్యాలూ రాసారు. ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా రికార్డింగ్ పూర్తిచేశారు. సుశీల, పి లీల ఇద్దరూ కల్సి రామకథ వినారయ్య , వినుడు వినుడు రామాయణ గాధ పాటలను పోటాపోటీగా పాడారు. కె రాణి రెండు పాటలు పాడారు. సాంగ్స్ విన్న నాగయ్య ఈ మూవీ శతదినోత్సవం ఖాయం అని ముందే చెప్పేసారు.
వాహిని స్టూడియోలో షూటింగ్ స్టార్ట్. ఎంజీఆర్ ఇంటి ఎదురుగా గార్డెన్ లో వాల్మీకి సెట్ వేశారు. తెలుగు, తమిళ వెర్షన్స్ లో అందరూ నటించారు. తమిళంలో పద్యాలు ఉండనందున వచనం పెట్టారు. కళా దర్శకుడు టి వి ఎస్ శర్మ ఎంతో శ్రమించి ఎన్టీఆర్ కిరీటం రూపొందించారు. నాలుగు కిరీటాలు చేసినా సూటవ్వకపోవడంతో చరణదాసి కోసం చేసిన 140 రూపాయల కిరీటం ఎన్టీఆర్ దగ్గరే ఉండడంతో చివరకు అదే వినియోగించారు.
భారీ బడ్జెట్ కావడంతో రానురాను ఆర్ధిక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఒకరోజు ఆగిన షూటింగ్ నాలుగేళ్లకు స్టార్ట్ అయింది. పంపిణీ దారుడు సుందర్ లాల్ నహతా సర్దుబాటు చేయడంతో మళ్ళీ షూటింగ్ మొదలుకి మార్గం ఏర్పడింది. ఈలోగా పుల్లయ్య అనారోగ్యం బారిన పడడంతో బిఎన్ రెడ్డిని సంప్రదించారు. అయితే కొడుకు సీఎస్ రావుతో పూర్తిచేయించమని సూచించడంతో అలాగే చేసారు.
రామ మందిరం, అడవిలో ఓ షాట్ సీఎస్ రావు తీశారు. సినిమా జాప్యం కావడంతో నటీనటుల వయస్సు తేడాలు కన్పించాయి. షూటింగ్ అయ్యాక సీరియస్ నెస్ తగ్గించేలా ఓ సాంగ్ పెట్టమంటే, అప్పటికపుడు రేలంగి , గిరిజాలతో ఒల్లనోరి మావ సాంగ్ షూట్ చేసారు. సినిమాలో ఈ సాంగ్ కి డబ్బులు ఇవ్వగా, రేలంగి, గిరిజ కూడా తిరస్కరించడంతో వాళ్ళ మంచి మనసుకి మెచ్చి, తర్వాత మంచి గిఫ్ట్ లను శంకర్ రెడ్డి ఇచ్చారు.
తెలుగువారి సీతారాములుగా ఎన్టీఆర్, అంజలి దేవి పేరుతెచ్చు కున్నారు. 1963లో రిలీజైన ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో నెంబర్ వన్ ఆక్రమించింది. సీత గా నటించిన అంజలీదేవి ఎక్కడికి వెళ్లినా పసుపు కుంకుమలతో జనాలు స్వాగతించేవారట. అపర రాముడిగా ఎన్టీఆర్ ని కొలవడం స్టార్ట్ చేసారు.