రాత్రి సమయంలో ఈ డ్రింక్ తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు
Nidra lemi samasya in telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవన శైలి కారణంగా వయస్సుతో సంబందం లేకుండా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి సమస్యను అశ్రద్ధ చేస్తే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఈ నిద్రలేమి కారణంగా ఒత్తిడి, డిప్రెషన్, అధిక బరువు, డయాబెటిస్ వంటి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మనలో చాలా మంది నిద్రలేమి సమస్య నుంచి బయటపడటానికి మందులు వాడుతూ ఉంటారు. అలా మందులు వాడటం కన్నా మన ఇంటిలో ఉన్న వస్తువులతో సహజసిద్ధంగా తగ్గించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ డ్రింక్ తయారీ కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి.
మిక్సీ జార్ లో ఒక స్పూన్ లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర, రెండు అంగుళాల దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నింపి నిలువ చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక తయారు చేసి పెట్టుకున్న పొడిని ఒక స్పూన్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి.
ఈ విధంగా తయారైన డ్రింక్ ని రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే క్రమంగా నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మారిన జీవన శైలి ప్రకారం మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు..
నిద్రలేమి సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. అదే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలు పాటిస్తూ ఈ డ్రింక్ తాగితే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది.కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.