Kitchenvantalu

ఓట్స్ సాండ్‌విచ్

కావలసిన వస్తువులు:
ఓట్స్ – 1/4 కప్పు,బ్రెడ్ స్లైసులు – 6,నెయ్యి – 1 టీస్పూన్,గడ్డ పెరుగు – 1 కప్పు,క్యాప్సికమ్ తురుము – 2 టీ స్పూన్,క్యారట్ తురుము – 3 టీ స్పూన్,వేయించిన జీలకర్ర – చిటికెడు,టమాటా సాస్ – 1 టీ స్పూన్,కొత్తిమిర – కొద్దిగా,మిరియాల పొడి – చిటికెడు,ఉప్పు – తగినంత,వెన్న – 4 టీ స్పూన్

తయారివిధానం

ముందుగా పొయ్యి వెలిగించి బాండిలో కొంచెం నెయ్యి వేసి వేడి చేసి ఓట్స్ ని దోరగా వేయించాలి. తర్వాత పెరుగును ఒక క్లాత్ లో వేసి మూట కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోని దానిలో వేయించిన ఓట్స్, క్యాప్సికమ్ తురుము, క్యారట్ తురుము, నీరంతా తీసివేసిన పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర అన్ని వేసి బాగా కలపాలి.

ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులను తీసి వేసి పలుచగా వెన్న రాయాలి. దీనిమీద ఒక స్పూన్ పెరుగు,పైన తయారుచేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని పరిచి,దానిమీద వెన్న రాసిన ఇంకో బ్రెడ్ స్లైసు ను పెట్టి మూసివేయాలి. దీనిని పెనం మీద కొద్దిగా వెన్న వేస్తూ రెండు వైపులా గోల్డ్ కలర్ వెచ్చే వరకు కాల్చాలి. అలాగే దీనిని ఓవెన్ లో కూడా కాల్చుకోవచ్చు.