సుమన్,భాను చందర్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి…ఎన్ని హిట్స్ ఉన్నాయో ?
ఒకప్పుడు ఎన్టీఆర్ – అక్కినేని, కృష్ణ – శోభన్ బాబు, కృష్ణ – కృష్ణంరాజు ఇలా మల్టీస్టారర్ మూవీస్ చాలా వచ్చాయి. అయితే మరో ఇద్దరు హీరోలు పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన యాక్షన్ హీరోలు సుమన్, భానుచందర్ కల్సి కొన్ని సినిమాలు చేసారు. విడివిడిగానే క్రేజ్ గల ఈ ఇద్దరు హీరోలు కల్సి నటించిన సినిమాలు బాగానే ఆడాయి.
1980నుంచి మంచి క్రేజీ హీరోలుగా నిల్చిన వీరిద్దరూ కల్సి 9 మూవీస్ లో నటించారు. మొదటిగా 1982లో ఇద్దరు కిలాడీలు మూవీ చేసారు. సుమన్ కి తెలుగులో ఇదే తొలి సినిమా కూడా. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అదే ఏడాది వచ్చిన తరంగిణి మూవీ సూపర్ హిట్ అయింది.
దీంతో హిట్ ఫెయిర్ అనే ముద్ర పడింది. 1984లో వచ్చిన గడుసుపిండం మూవీ పెద్దగా ఆడకపోయినా ప్రొడ్యూసర్ కి లాభం తెచ్చింది. అదే ఏడాది మెరుపు దాడి మూవీ కమర్షియల్ హిట్ అయింది. తర్వాత కుర్ర చేష్టలు మూవీ కూడా 1984లోనే వచ్చి లాభాలు తెచ్చింది. 1985లో మొండి జగమొండి మూవీ కూడా సక్సెస్ అయింది.
1986లో వచ్చిన సమాజంలో స్త్రీ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. 1987లో వచ్చిన డాకు మూవీ మంచి కమర్షియల్ మూవీ అయింది. అయితే సుమన్ ,భానుచందర్ కాంబోలో 1993లో నక్షత్ర పోరాటం వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ఇది. 1995లో ఓ సినిమా ప్రకటించినా ఎందుకో ఆగిపోయింది. వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ . ఇప్పటికీ వీరి స్నేహం కొనసాగుతోంది.