ఈ పండ్ల తొక్కలను పాడేస్తున్నారా…ఈ విషయం తెలిస్తే అసలు పాడేయరు
Fruit Peel Benefits In Telugu :మనలో కొంత మంది పళ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే కొంత మంది పళ్లను అసలు తినరు. మనం తినే అన్ని రకాల పండ్లలోనూ మినిరల్స్ ,విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మనం రెగ్యులర్ గా పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే మనం తిని పాడేసే తొక్కలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మీరు పండ్ల తొక్కలను పాడేయకుండా తింటారు. ఇప్పుడు ఏ పండు తొక్క తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుస్కుందాం.
ఆరెంజ్ తొక్క
ఆరెంజ్ పండులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఆరెంజ్ తొక్కలో కూడా సమృద్ధిగా ఉంటాయి. మలబద్దకం, శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరెంజ్ పీల్స్‌లో హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలు కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. అందువల్ల ఆస్తమాను నయం చేస్తుంది.
దానిమ్మ తొక్క
దానిమ్మతొక్కలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన అనేక రకాల వ్యాధులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచటమే కాకుండా గొంతు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
పుచ్చకాయ తొక్క
పుచ్చకాయ తొక్కలో విటమిన్లు సి, బి6, ఎ, పొటాషియం,జింక్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు పుచ్చకాయ తొక్కను తింటే చాల మార్పు కనపడుతుంది. పుచ్చకాయ తొక్కలో ఉండే సిట్రులిన్ ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
నిమ్మతొక్క
నిమ్మతొక్కలో విటమిన్ సి,యాంటీ సెప్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఓరల్ ఇన్ఫెక్షన్స్, స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బాగా సహాయాపడుతుంది. అంతేకాక ఒత్తిడిని తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది. శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయ పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.