యమలీల మూవీలో కృష్ణ స్పెషల్ సాంగ్ చేయటానికి కారణం ఇదేనట
Krishna Special Song in Yamaleela Movie :భారీ బడ్జెట్ తో అగ్ర తారాగణంతో సినిమాలు వస్తున్న రోజుల్లో ఓ కమెడియన్ ని హీరోగా పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డిదే. అలీని హీరోగా సినిమా ఏంటని అడిగిన వాళ్ళు విస్తుపోయేలా తన మాయాజాలంతో సూపర్ హిట్ చేసాడు.
సెట్టింగ్స్ లేవు, విదేశాల్లో షూటింగ్ లేదు అయినా ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్స్ కి ఒకటికి పదింతలు లాభాలు తెచ్చింది. కథాబలంతో 100రోజులు ఆడేసింది. 75లక్షలతో తీసిన ఈ మూవీ 12కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్ నిజంగా ఓ ప్రత్యేకత తెచ్చింది.
పచ్చని సంసారం తర్వాత మళ్ళీ కృష్ణ హవా మొదలై, నెంబర్ వన్ , వారసుడు వంటి మూవీస్ తో పూర్వ వైభవం తెచ్చింది. అయితే నెంబర్ వన్ లాంటి మంచి హిట్ ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి స్వయంగా వచ్చి అడగడంతో యమలీల మూవీలో సాంగ్ చేయడానికి ఒకే చెప్పారు. సాంగ్ ఎక్కడ, ఎందుకు , ఎలా అని ఏమీ అడక్కుండానే ఒకే చెప్పిన కృష్ణ నమ్మకానికి తగ్గట్టు పాట షూట్ చేసారు.
జుంబారే సాంగ్ సినిమాలో సందర్భానికి సరిగ్గా అతుక్కుపోవడమే కాదు, స్టెప్స్, సంగీతం అన్నీ బాగా కుదిరాయి. చిత్ర గుప్తుని కోరిక మేరకు యమధర్మరాజు సృష్టించిన వినోద వల్లరి కార్యక్రమంగా ఈ సాంగ్ వస్తుంది. అందుకే కృష్ణ ఫాన్స్ చేత ఈ సాంగ్ విజిల్స్ వేయించింది. కృష్ణ వయస్సు, స్టెప్స్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు.
అప్పట్లో చాలా సినిమాలు వచ్చినా , వాటి ప్రభావం యమలీల మీద పడలేదు. పైగా ఈ సినిమా ప్రభావం మిగిలిన సినిమా కలెక్షన్స్ మీద చూపించింది. 100రోజుల వేడుకకు వెంకటేష్, బాలకృష్ణ చీఫ్ గెస్టులుగా వచ్చారు.