Healthhealth tips in telugu

ఈ గింజలను ఇలా తీసుకుంటే శరీరంలో రోగనిరోధకశక్తి పెరగటమే కాకుండా…మరెన్నో ప్రయోజనాలు

Halim Seeds Health benefits in telugu : ఒక బౌల్ లో రెండు స్పూన్ల Halim Seeds వేసి నీటిని పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టాలి. మిక్సీ జార్ లో ఒక స్పూన్ వాల్ నట్స్, ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ పిస్తాపప్పులను వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అరలీటర్ పాలను పోయాలి.
Halim Seeds
పాలు ఒక పొంగు వచ్చాక పొడి చేసిన dry Fruits వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నానబెట్టి ఉంచిన Halim Seeds వేసి బాగా కలిపి రెండు స్పూన్ల పటికబెల్లం పొడి వేసి బాగా కలిపి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించి అరస్పూన్ యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేయాలి.

వారంలో రెండు సార్లు అరగ్లాసు మోతాదులో తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
ఆకలి హార్మోన్ ‘గ్రెలిన్’ ని నియంత్రించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. మలబద్ధకం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యల చికిత్సకు సమర్థవంతమైన నివారణ అని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
blood thinning
ఎందుకంటే ఈ గింజలలో ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది. రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడే అనేక సమ్మేళనాలు ఈ గింజలలో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.
asthama
అలాగే, ఈ సూపర్‌ఫుడ్‌లను నమలడం వల్ల దగ్గు మరియు గొంతు నొప్పి చికిత్సలో సహాయపడుతుంది. కాబట్టి, సీజనల్ మార్పుల సమయంలో మీ ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా సీజనల్ సమస్యలు లేకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.