MoviesTollywood news in telugu

ఏకలవ్య సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభం వచ్చిందో ?

Ekalavya movie telugu : మహా భారతంలో ఏకలవ్యుని ప్రస్తావన చిన్నదే అయినా అతడి గురుభక్తి లోకవ్యాప్తమైంది. అందుకే ఇతడి కథను తెరకెక్కించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా చివరకు సూపర్ స్టార్ కృష్ణ కు సాధ్యమైంది. దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు మొదట్లో ఏకలవ్య సినిమా తీయాలని భావించారు.

రాధమ్మ పెళ్లి, స్వర్గం నరకం మూవీస్ తీసిన ఎంకే మావుళ్ళయ్య, రామతారకం,భాస్కరరావు లు నిర్మాతలుగా ఆరుద్ర రాసిన కథతో ఏకలవ్య తీయడానికి దాసరి సన్నద్ధం అయ్యారు. ఎన్టీఆర్ తో కృష్ణుడు, ద్రోణ పాత్రలను చేయించి బాలకృష్ణతో ఏకలవ్య పాత్ర చేయించాలని దాసరి యత్నం. రెండు పాటలు కూడా చేసారు.

అయితే అప్పటికే దాన వీర సూర కర్ణ మూవీ చేస్తున్నందున మరో మూవీ గురించి ఆలోచించేది లేదని నిర్మాతలకు ఎన్టీఆర్ చెప్పేసారు. ఇక బాలయ్య డేట్స్ అడిగితె స్టడీస్ లో ఉన్నందున కుదరదని ఎన్టీఆర్ చెప్పేసారు. దాంతో కృష్ణ దగ్గరకు వెళ్తే ఆయన కూడా బిజీ. ఇక శోభన్ బాబు దగ్గరకు వెళ్లి అడగ్గా, ఛాతీమీద వెంట్రుకలు తీయడం పెద్ద పని కనుక నో చెప్పేసారు. అయితే బతిమాలడంతో ఒకే చెప్పారు.

హీరోయిన్ కోసం జయప్రదను సంప్రదించగా, డిమాండ్ ఉన్నప్పటికీ దాసరి మూవీ కావడంతో 40 వేలకు చేయడానికి ఒప్పుకుంది. రామకృష్ణను కృష్ణుడిగా అనుకున్నారు. ఇక బడ్జెట్ లెక్కలేసారు. అయితే దర్శకేంద్రుడు మొదటి మూవీ శోభన్ బాబు హీరోగా చేసిన బాబు మూవీకి 18లక్షలు అయింది. ఏకలవ్యకు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉందని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

ఈలోగా వేరే సినిమా ఛాన్స్ రావడంతో దాసరి ఏకలవ్య మూవీ పక్కన పెట్టేసారు. ఆరేళ్ళు గడిచిపోయాయి. ఇక తాతయ్య పెళ్లి సినిమాతో దెబ్బతిన్న ఎం ఎస్ రెడ్డి రెండేళ్లు విరామం తర్వాత ఏకలవ్య నిర్మాణం సన్నాహాలు మొదలుపెట్టారు. కృష్ణను అడిగిందే తడవుగా డేట్స్ ఇచ్చేసారు. తన బొటను వేలిని గురువుకి కోసి ఇవ్వడం అనే ఒకే పాయింట్ తో రెండున్నర గంటల సినిమా అంటేనే సాహసం.

కొండవీటి వేంకటకవి కథ రాశారు. అల్లూరి సీతారామరాజు తర్వాత అంతగా కృషి చేసి నటించిన సినిమా ఏకలవ్య అని కృష్ణ ఇప్పటికీ చెప్పేమాట. మోగింది ఢమరుకం మేల్కొంది హిమ నగం పాటకు క్లాసికల్ డాన్స్ అవసరం. కొరియోగ్రాఫర్ శ్రీను చెప్పినట్టు మూడు రోజులు ప్రాక్టీస్ చేసి మరీ కృష్ణ నటించారు.నిజానికి ఆ పాత్ర చేయగలనా లేదా అనే ఆలోచన లేకుండా ధైర్యంగా ముందడుగు వేయడం కృష్ణ లక్షణం. అందుకే సూపర్ స్టార్ అయ్యాడు. కృష్ణ ఫాన్స్ కూడా ఈ మూవీని హిట్ చేసారు.