Healthhealth tips in telugu

పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు,జలుబు,జ్వరం,గొంతులో శ్లేష్మం నుండి విముక్తి 1 రోజులో

Winter Immunity Home Remedies In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే దగ్గు, గొంతులో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఈ రోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి.
Dalchina chekka for weight loss
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి ఏ సమస్యలు ఉండవు. ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Honey
రోగనిరోధక శక్తిని పెంచే చాలా వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందులో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్క, తేనె కలిపిన మిశ్రమం చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి మూడు స్పూన్ల తేనె కలిపి పెద్దవారు అయితే రోజులో అరస్పూన్,చిన్న వారైతే పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది.

దాల్చిన చెక్క,తేనె మిశ్రమం శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దాల్చిన చెక్క పొడి మార్కెట్ లో దొరుకుతుంది. కానీ ఇంటిలో చేసుకుంటేనే మంచిది. దాల్చిన చెక్కను డ్రై రోస్ట్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు…అంటే 15 రోజుల వరకు అయితే మంచి ఫ్లెవర్ తో ఉంటుంది. కాబట్టి దాల్చినచెక్క పొడిని ఇంటిలో తయారుచేసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.