రాకుమారుడు సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు …ఎన్ని కోట్ల లాభం…?
Rakumarudu Telugu Movie : సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసత్వంగా రాజకుమారుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం అయ్యాడు. అప్పటికే టాలీవుడ్‌కు వెంకటేష్ లాంటి హీరోను పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సరిగ్గా అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు మహేష్ బాబును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.
తొలి సినిమా రాజకుమారుడు సమయంలో చిన్న పిల్లాడిలా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబును చూసి ముద్దొస్తున్నాడంటూ అప్పట్లో చాలామంది కామెంట్ కూడా చేసే వారు. అవే ఫోటోలను ఇప్పుడు చూసినా కూడా అందరూ అదేమాట అంటారు. అప్పట్లో మహేష్ చూసి అప్పుడు అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్లు.
నెట్ లో ఈ ఫోటోలు వైరల్ అవుతుంటే, మహేష్ ఫాన్స్ మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నారు. 1999లో ఈయన తెరకెక్కించిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబుని అప్పట్లో అభిమానులు మహేష్‌ను ప్రిన్స్ స్టార్ గా పిలుచుకునేవారు. ఆ తర్వాత సూపర్ స్టార్ గా వ్యవహరించడం మొదలు పెట్టారు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఈయనకు జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. అయితే 1999 జులై 30న విడుదలైన రాజకుమారుడు సంచలన విజయం సాధించి మహేష్ కెరీర్‌కు కావాల్సిన పునాది పటిష్టం చేసింది.. 1999లోనే ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది.
ఆ రోజుల్లోనే 11 కోట్ల వరకు షేర్ వసూలు చేసాడు మహేష్ బాబు. ఇక 80 కేంద్రాల్లో 50 రోజులు.. 44 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది రాజకుమారుడు. ఈ సినిమా తర్వాత యువరాజు, వంశీతో కాస్త వెనుకబడిన మహేష్ బాబు ఆతర్వాత కృష్ణ వంశీ తీసిన మురారి మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి,సూపర్ స్టార్ గా ఎదిగాడు.
https://www.chaipakodi.com/