శ్రీదేవి,జయసుధ,జయప్రదలకు సినిమా లైఫ్ ఇచ్చిన ఆ నటుడు ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా నటుడు చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా వేస్తే వాళ్ళ కెరీర్ దూసుకెళ్లి, అత్యున్నత స్థాయికి చేరుతారనే నమ్మకం బలంగా ఉంది. జయప్రద,శ్రీదేవి,జయసుధ,రాధిక, విజయశాంతి ఇలా ఎందరో ఆయన పక్కన నటించి తారాపధాన నిలిచారు.
సిరిసిరి మువ్వలో జయప్రద,పదహారేళ్ళ వయస్సులో శ్రీదేవి ఈయన పక్కన నటించి టాలీవుడ్ లోనే కాదు,బాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ అయ్యారు. సీతామహాలక్ష్మీ మూవీతో తాళ్ళూరి రాజేశ్వరికి ఎనలేని పేరు వచ్చింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించడానికి చంద్రమోహన్ వెనుకాడనందున మూవీస్ లో నటించడానికి హీరోయిన్స్ ఎక్కువ మక్కువ చూపేవారు.
1966లో రంగుల రాట్నం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తొలి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్నారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో నటిస్తూ,వయస్సు మీద పడుతున్న కొద్దీ అందుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ, తన సహజ నటనతో చంద్ర మోహన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడ్డారు.
బంగారు పిచ్చుక,ఆత్మీయులు,తల్లిదండ్రులు జీవన తరంగాలు,అల్లూరి సీతారామరాజు,ప్రాణం ఖరీదు,కురుక్షేత్రం,శంకరాభరణం,శుభోదయం, మనిషికో చరిత్ర,రాధా కళ్యాణం,ముగ్గురు మిత్రులు,అల్లుడుగారు,ఆమె ఇలా ఎన్నో చిత్రాల్లో సెంటిమెంట్ ని ,హాస్యాన్ని పండించడంలో కూడా తనకు తానే సాటిగా నిలిచారు.
16ఏళ్ళ వయస్సు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు, చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్యనటుడుగా, అతనొక్కడే మూవీకి ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు లు పొందారు. ఇంకా నటిస్తూ, ఇప్పటికే 500కి పైగా సినిమాలు చేసిన చంద్రమోహన్ 50ఏళ్ళ నటనా జీవితాన్ని పూర్తిచేసుకున్నారు.