దేవదాసు మూవీ వెనుక కొన్ని నమ్మలేని నిజాలు…మొదట ఏ హీరో దగ్గరకు వెళ్లిందో తెలుసా?
Ram Devadasu Telugu Movie : ఎప్పుడో అక్కినేని దేవదాసు తర్వాత అదే పేరిట కమర్షియల్ మూవీగా వచ్చిన రామ్,ఇలియానా దేవదాస్ సెన్షేషనల్ హిట్ అయింది. ఈసినిమా వెనుక కథలోకి వెళ్తే, నందమూరి హరికృష్ణతో తీసిన సీతయ్య సినిమా హిట్ అయ్యాక ఓ లవ్ స్టోరీ చేయాలని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ప్లాన్ చేసాడు.
వైవిఎస్ చౌదరి రోడ్డుమీద వెళ్తుంటే పాతాళభైరవి పోస్టర్ కనిపించడంతో ఇలాంటి సినిమా ఒకటి చేయాలనీ యోచన మొదలైంది. రాణి గారి కోసం మాంత్రికుడి కోటలోకి వెళ్తాడు తోటరాముడు. ఇలాగే ఓ మాస్ అబ్బాయ్, ఓ క్లాస్ అమ్మాయి. అమ్మాయి కోసం హీరో అమెరికా వెళ్తాడు. అదీ స్టోరీ లైన్. 20 రోజుల్లో స్టోరీ రెడీ అయింది. హీరో అల్లు అర్జున్ అయితే బాగుంటాడని గీతా ఆర్ట్స్ దగ్గరకి వెళ్తే, ప్రస్తుతం ఆర్య షూటింగ్ చేస్తున్నాడు ,అది అయ్యాక చేద్దాం అని అల్లు అరవింద్ చెప్పాడు.
ఆర్య హిట్ అయ్యాక స్టార్ హీరో గా ఈ కథ ఒప్పుకుంటాడా అని డౌట్ రావడంతో కొత్తవాళ్లతో చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈలోగా స్రవంతి రవికిశోర్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లిన వైవీఎస్ కి ఓ రీమేక్ మూవీ చేయాలన్న ఆఫర్ వచ్చింది. దాంతో ఆల్ రెడీ నా దగ్గర ఓ కథ ఉందని, కొత్త హీరో కోసం చూస్తున్నట్లు వైవిఎస్ చెప్పాడు.
అయితే ఓ ఆల్బమ్ చూపిస్తూ యితడు మా తమ్ముడు కొడుకు రామ్. మలయాళ మూవీ రీమేక్ చేస్తున్నాం. యితడు పనికొస్తాడేమో చూడండి అనడంతో ఒకే చేసేసాడు. అయితే ఫేమస్ డైరెక్టర్ శంకర్ నిర్మాతగా కాదల్ మూవీ నిర్మిస్తూ అందులో రామ్ ని ఒక హీరోగా తీసుకున్నారు. అయితే వైవీఎస్ ద్వారానే ఎంటర్ చేయాలనీ భావించిన స్రవంతి రవికిశోర్ వెంటనే కాదల్ మూవీ వదిలేసి,వైవిఎస్ మూవీకి ఒకే చెప్పాడు.
అదేసమయంలో బన్నీ నుంచి ఫోన్ మూవీ చేద్దామని ,కానీ రామ్ కి మాటిచ్చానని వైవిఎస్ చెప్పేసి బన్నీ అఫర్ వదిలేసాడు. అయితే ధైర్యం మూవీలో చేద్దామనుకున్న ఇలియానా ఆ పాత్రకి సూటవ్వదని భావించి వైవిఎస్ ఆఫీస్ కి పంపాడు డైరెక్టర్ తేజ. అలా వెళ్లిన ఇలియానా హీరోయిన్ గా ఒకే అయింది. 2004 సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. బాలరాజు టైటిల్ అనుకున్నారు. నాలుగు కోట్ల బడ్జెట్ తో అమెరికా,బ్యాంకాక్, హైదరాబాద్ లలో షూటింగ్. కానీ ఆరుకోట్లకు బడ్జెట్ చేరింది.
కొత్తవారితో అంతబడ్జెట్టా అని అందరూ ఆశ్చర్యపోయారు. టైటిల్ ఇంకా బాగుండాలని దేవదాసుగా మార్చారు. 2006జనవరి 11న విడుదలైన ఈ మూవీ కి పోటీగా లక్ష్మీ,స్టైల్,చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలు వున్నాయి. మొదటి నాలుగు వారాలు డివైడ్ టాక్ తో, ఆతర్వాత సూపర్ హిట్ టాక్ తో నడిచిన దేవదాసు లో చక్రి పాటలు బ్లాక్ బస్టర్. 26కేంద్రాల్లో వందరోజులు ఆడింది. అయితే 17కేంద్రాల్లో 175డేస్ నడిచి సెన్షేషన్ క్రియేట్ చేసింది.13కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్ కి డబుల్ ప్రాఫిట్ తెచ్చింది. తొలిసినిమాతోనే 18ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చి, రామ్ స్టార్ హీరో అయ్యాడు. ఇలియానా క్రేజ్ తెచ్చేసుకుంది.