ఘరానామొగుడు VS చంటి… ఒకే సంవత్సరం రెండు ఇండస్ట్రీ హిట్స్…ఎలానో…?
తెలుగు సినిమా రంగంలో ఇద్దరు ,ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయితే వాటి రెస్పాన్స్ మీద చాలామందికి ఆసక్తి ఉంటుందని చెప్పక్కర్లేదు. ఒక్కోసారి అవన్నీ హిట్ అయిపోతాయి. అలా 1992లో రెండు సినిమాలు విడుదలై కలెక్షన్స్ మోత మోగించాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు.
రెండవది విక్టరీ వెంకటేష్ నటించిన చంటి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ లో తేడా కొన్ని లక్షలు మాత్రమే. అయితే చంటిని ఘరానా మొగుడు క్రాస్ చేసిందని,చేయలేదని ఇలా ఇద్దరి ఫాన్స్ మధ్య రచ్చ నడిచింది. 1992జనవరి 10న చంటి మూవీ విడుదలైంది. వెంకీ నటన,పాటలు,ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ వెరసి ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.
100రోజుల దాకా ఈ సినిమా కలెక్షన్స్ వరద పారింది. గ్యాంగ్ లీడర్ మూవీ రికార్డ్ ని రెండు కోట్ల మార్జిన్ తో అధిగమిస్తూ 9కోట్ల షేర్ వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత ఎండబండ్ల మీద థియేటర్స్ కి జనం వచ్చిన సినిమా గా నిల్చింది. 33కేంద్రాల్లో 100రోజులు ఆడిన సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 90రోజుల గ్యాప్ లో విడుదలైన ఘరానా మొగుడులో చిరంజీవి మాస్ యాక్టింగ్,సాంగ్స్ తో సూపర్ హిట్ అయింది.
మొదిటివారంలో రికార్డ్ స్థాయిలో వసూళ్లు చేసి,టోటల్ గా 9కోట్ల50లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 39కేంద్రాల్లో 100రోజులు ఆడడం ద్వారా ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. నైజాం,ఈస్ట్,కర్ణాటకలో చంటి మూవీని క్రాస్ చేసింది. మిగిలిన ఏరియాల్లో చంటి పైచేయిగా ఉంది. అయితే ఈ మూడు ఏరియాల్లో చంటి కన్నా 40లక్షలు ఎక్కువ ఘరానా మొగుడు కలెక్ట్ చేసింది. దీంతో చంటిని క్రాస్ చేసిందని చిరు ఫాన్స్,క్రాస్ చేయలేదని వెంకీ ఫాన్స్ కరపత్రాలు వేసి హడావిడి చేసారు. రెండు సినిమాలు కలెక్షన్స్ లో కొత్త ప్రభంజనం సృష్టించినా ఇరు ఫాన్స్ నడుమ అలా వార్ నడిచింది.