Movies

లక్ష్మి సినిమా వెనక జరిగిన నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభం వచ్చిందో…?

క్లాస్ అండ్ మాస్ ఫాలోవర్స్ గల విక్టరీ వెంకటేష్ రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ తో సాగే సినిమా లో తన ఫ్యామిలీని కాపాడుకునే ఇంటి పెద్ద కొడుకు కథగా లక్ష్మి మూవీ ఉంటుంది. ఎక్కువగా క్లాస్ సినిమాలు చేసే వెంకీ మాస్ మూవీ చేస్తే కలెక్షన్స్ వీరలెవెల్లో ఉంటాయి. లక్ష్మీ మూవీ అందుకు నిదర్శనం.

నిజానికి ఈ సినిమా అంతర్గత విషయాల్లోకి వెళ్తే,2005లో బన్నీ మూవీ తర్వాత నాగార్జున,ప్రభాస్ తో వివి వినాయక్ కి ఆఫర్స్ వచ్చాయి. కానీ నాగ్ ని అడిగితె వచ్చే ఏడాది చేద్దాం అన్నాడట. అదేసమయంలో నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ దగ్గర వెంకీ డేట్స్ ఉన్నాయి. విషయం చెప్పేసరికి,వెంకీ కి వివరించడం వినాయక్ అయితే తనకు కొత్తగా ఉంటుందని ఒకే చేసాడు.

స్టోరీ చెప్పడంతో బానే ఉంది కానీ, ఫ్యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేస్తున్నాయని,అందుకని మెయిన్ లైన్ అలాగే ఉంచేసి, బ్యాక్ డ్రాప్ మార్చమని వెంకీ చెప్పాడట. ఇంకేముందు ఆస్థాన రైటర్ ఆకుల శివతో కల్సి నెలరోజుల్లో కథ రెడీ చేసాడు. శివ మాటలు రాసేసాడు. క్లాస్,మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన కథ కావడంతో వెంకీకి బానే నచ్చింది.

హీరోయిన్స్ గా ఆర్తి అగర్వాల్,ఛార్మి లను అనుకున్నారు. అయితే ఆర్తికి డేట్స్ ఖాళీ లేకపోవడంతో నయనతారను కన్ఫర్మ్ చేసేసి, సినిమాకు లక్ష్మీ అనే టైటిల్ పెట్టారు. మణిశర్మ మ్యూజిక్ అనుకుంటే బిజీ కావడంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలని మాట తీసుకుని,సాంగ్స్ కోసం రమణ గోగుల ను పెట్టారు. హైదరాబాద్ రామానాయుడి స్టూడియోలో మూడు సెట్స్ వేశారు.

కలకత్తాలో 15రోజుల షెడ్యూల్, ఘాట్ కేసర్ లో కాలేజీ సీన్స్ తీసి,న్యూజిలాండ్ లో సాంగ్స్ షూట్ చేసారు. 12కోట్ల బడ్జెట్ తో 80రోజుల్లో సినిమా చేసేసారు. అన్ని చోట్లా హాట్ కేకులా అమ్మడయింది. 5కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చేయడంతో సినిమా గ్రాండ్ గా320సెంటర్స్ లో రిలీజ్ చేసారు.2006జనవరి 14న వచ్చిన ఈ మూవీకి ఓపినింగ్స్ అదిరాయి.

వెంకీ నటన,కామెడీ,ఫ్యామిలీ సెంటిమెంట్ వెరసి సినిమా పిచ్చగా నచ్చేసి, బ్లాక్ బస్టర్ అయింది. మొదటి వారం9కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ గా 24కోట్లు కలెక్ట్ చేసి వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ గా నిల్చింది. 215సెంటర్స్ లో 50రోజులు,90సెంటర్స్ లో వంద ఆడింది. వెంకీకి ఇంటర్ డక్షన్ సీన్ కేరీర్ లోనే హైలెట్ అయింది. వేణు మాధవ్,తెలంగాణ శకుంతల కామెడీ పండింది. నయనతార స్టార్ హీరోయిన్ అయింది. ఇలా ఎన్నో రికార్డ్స్ తో లక్ష్మీ సెన్షేషన్ అయింది.