Lucky Direction by Zodiac Sign:ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి?
Lucky Direction by Zodiac Sign:రాశిని బట్టి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాశి వారు వారి రాశిని బట్టి కొంత మంది దేవుళ్లకు కొన్ని నైవేద్యంగా తాంబూలాలను పెడితే కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు.
ఈతిబాధలతో సతమతమయ్యేవారు ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలని అడుగుతుంటారు చాలా మంది. అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి. 12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..
మేష రాశి .
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
వృషభ రాశి
తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.
మిథున రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
కర్కాటక రాశి
తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.
సింహ రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.
కన్యారాశి
తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.
తులా రాశి
తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
వృశ్చిక రాశి
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
మకర రాశి
తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.
కుంభ రాశి
తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.
మీన రాశి
తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
కాబట్టి మీ రాశి ప్రకారం తాంబూలం సమర్పించండి. అయితే మనలో చాలా మందికి జాతకాలు అంటే నమ్మకం ఉండదు . మరి కొంతమందికి జాతకాలు అంటే విపరీతమైన నమ్మకం ఉంటుంది. కాబట్టి జాతకాలను నమ్మేవారికి మాత్రమే ఈ ఆర్టికల్. కాబట్టి ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి… అనే విషయాన్ని తెలుసుకున్నారుగా.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ