ఈ జ్యూస్ తాగితే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, రక్తహీనత అసలు ఉండవు… ముఖ్యంగా మహిళలకు
Beetroot And Almond Juice In telugu : ఈ రోజుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా మనం ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు ఇంటి పని, ఆఫీసు పని అంటూ రోజంతా ఏదో ఒక పనితో ఎక్కువగా అలసిపోతు ఉంటారు.
అలాంటివారు అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండటానికి బీట్రూట్ బాదం జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జ్యూస్ ను వారంలో రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. రాత్రి సమయంలో ఐదు బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం నానిన బాదంపప్పు తొక్కలను తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత చిన్న బీట్రూట్ దుంప తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, తొక్క తీసిన బాదంపప్పులు, అర కప్పు కొబ్బరి ముక్కలు, ఒక గ్లాసు నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ సెపరేట్ చేయాలి. ఈ జ్యూస్ ను వారంలో రెండుసార్లు తీసుకుంటే ముఖ్యంగా మహిళలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు., కీళ్ల నొప్పులు ఉన్నవారికి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతంను పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండి అల్జీమర్స్ వంటి సమస్యలు ఏమీ లేకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది.అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. 30 సంవత్సరాలు దాటిన మహిళలు వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.