ఈ నూనె రాస్తే కీళ్ల నొప్పి,చేతులు,కాళ్ళ తిమ్మిర్లు, నరాల నొప్పులు అన్నీ తగ్గుతాయి
Joint Pain Oil in Telugu : ఈ రోజుల్లో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి వాటిలో నొప్పులు ఒకటి. నొప్పులు వచ్చినప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. అలా మందులు వాడకుండా ఇప్పుడు చెప్పే నూనెను వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది.
రెండు జాజికాయలను పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో 6 స్పూన్ల ఆవనూనె,రెండు స్పూన్ల ఆముదం వేసి మరిగించాలి. మరిగాక ఆ నూనెలో జాజికాయ పొడి వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ నూనె చల్లారాక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఇలా నొప్పులు ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఈ నూనెను రాసుకొని మసాజ్ చేసి పడుకుంటే మంచి నిద్ర పట్టటమే కాకుండా నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. జాజికాయ, ఆవనూనెలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని వెళ్ళి నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది.
జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకల్లో లేదా కండరాల్లో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. ఆవనూనె నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆముదం కూడా నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.