MoviesTollywood news in telugu

కాలాపాని సినిమా గురించి నమ్మలేని నిజాలు…షాకింగ్ బడ్జెట్

Kaalapani Movie :ఐదు భాషల్లో రిలీజై హిట్ కొట్టిన కాలాపాని అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా నిల్చింది. మంచి దర్శకుడిగా పేరొందిన ప్రియదర్శన్ కి దేశభక్తి మూవీ చేయాలన్నది ఎప్పటి నుంచో కోరిక. 1994లో మోహన్ లాల్ కి ఓ షూటింగ్ లో ఈ విషయం చెప్పారు. 1910-15మధ్య అండమాన్ నికోబర్ దీవుల మధ్య జరిగిన యదార్ధ సంఘటనలతో కూడిన ఈ సినిమాకు మోహన్ లాల్ ఒకే చెప్పేసాడు. అప్పులతో స్వాతంత్ర్య సమరయోధులను అండమాన్ జైలులో పెట్టి చిత్రహింసలకు గురిచేసే వారు. ఇక ప్రముఖ దేశభక్తుడు వీర సావర్కర్ ని కూడా ఇదే జైలులో బంధించారు. ఇలాంటి ఐదుగురి స్వాతంత్ర్య సమరయోధుల బయోగ్రఫీ క్షుణ్ణంగా స్టడీ చేసి, జైలు గురించి బుక్స్ కూడా చదివి కథ రెడీ చేసారు. దామోదరన్ కథకు సహకారం అందించి డైలాగ్స్ రాసారు.

ఇక అప్పట్లో మలయాళంలో కోటి రూపాయలను ఏ సినిమా మించని రోజుల్లో ఈ సినిమాకోసం మూడు కోట్లు బడ్జెట్ అంచనా. పాత దృశ్యాలు కన్పించేలా సెట్స్ వేయాలి, కాస్ట్యూమ్స్ ఉండాలి. దాంతో ఖర్చు ఎక్కువ కావడంతో గుడ్ నైట్ మోహన్ తో కల్సి ఈ భారీ ప్రాజెక్ట్ కి మోహన్ లాల్ నిర్మాణానికి కూడా ముందుకొచ్చారు. మలయాళంలో తీసినా తెలుగు, తమిళ్, హిందీ , ఇంగ్లీషులో కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్. అందుకే నటీనటుల ఎంపిక పక్కాగా చేసారు. మోహన్ లాల్ , టబు, టిన్ను ఆనంద్, అమ్రిష్ పురి, ప్రభు, ఢిల్లీ గణేష్, తెలుగు, బెంగాలీ నటులను తీసుకున్నారు. ఫారిన్ నటులను 60మందిని రప్పించారు. అండమాన్ లో ఓ గిరిజన తెగకు చెందిన 40మందిని తీసుకున్నారు. వారి భాష తెలియకపోయినా , యాక్ట్ చేయించి, అవుట్ ఫుట్ తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా, కెమెరామెన్ గా సంతోష్ శివన్.

చెన్నైలో స్టూడియోలో ఎకరం స్థలంలో 12లక్షలతో జైలు సెట్ వేశారు. అండమాన్ , నికోబర్ దీవుల్లో చిన్న చిన్న సెట్స్ వేశారు. కేవలం కాస్ట్యూమ్స్ కి 30లక్షలు అయింది. నాలుగు గుర్రాలు, కార్లు 30లక్షలతో కొనేశారు. అండమాన్ బోటులో వెళ్ళడానికి రోజుకి లక్ష ఖర్చు. 1995ఏప్రియల్ లో షూటింగ్ స్టార్ట్. కాలాపాని అంటే బ్లాక్ వాటర్. అండమాన్ సెల్యులార్ జైలులో ఖైదీలకు బ్లాక్ వాటర్ శిక్ష(కఠిన శిక్ష) విధించేవారట. రోజూ ఎక్విప్ మెంట్ బదిలీకి 200మంది అవసరమయ్యేవారు.

షూటింగ్ లో భాగంగా అమ్రిష్ పురి బూట్లు నాకాలి. కానీ మోహన్ లాల్ ఈ సిను పండించడం కోసం నిజంగానే అలాచేయడం అందరిని షాక్ కి గురిచేసింది. దీంతో హేట్సాఫ్ మోహన్ లాల్ సర్ అంటూ అమ్రిష్ పురి హగ్ చేసుకుని ఏడిచేశారట. 140రోజుల పనిదినాల్లో షూటింగ్ చేసారు. సౌండ్ ఎఫెక్ట్, డిజైన్ కోసం 90డేస్ కేటాయించారు. మూడు కోట్లు బడ్జెట్ దాటేసింది. తెలుగు, తమిళ్, మలయాళం రైట్స్ కి మంచి రేటు వచ్చింది. హిందీ రైట్స్ అమితాబ్ కోటి రూపాయలకు కొన్నారు. అయితే అప్పటికే అజయ్ దేవగన్ హిందీలో కూడా కాలాపాని స్టార్ట్ చేయగా, ఆపేసారు. ఏప్రియల్ 6న 450థియేటర్లలో వరల్డ్ వైడ్ రిలీజయింది.

స్వాతంత్ర్య సమరయోధులు ఎన్ని కష్టాలు అనుభవించి, ఎంత చిత్రవధకు గురయ్యారో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపడం తో వారి కాళ్లకు నమస్కరించాలి రకరకాల భావోద్వేగాలను కలిగించింది. నరనరాల్లో దేశభక్తిని రేకెత్తించింది. ప్రాణం పోతున్నా సరే, వందేమాతరం అనే నినాదాన్ని వదలని తెగువ మనల్ని రగిలింపజేస్తుంది. వీర సావర్కర్ గా అనుకపూర్, ఖైదీగా ఢిల్లీ గణేష్ అదరగొట్టగా, గోవర్ధన్ క్యారెక్టర్ లో ఆస్కార్ రేంజ్ లో చేసాడు. 4నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ డీవోపీ, బెస్ట్ ఆడియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లలో నేషనల్ అవార్డ్స్ తో పాటు ఏడు కేరళ స్టేట్ అవార్డు ఫిలిమ్ అవార్డ్స్ సాధించింది. మళయాళంలోనే 10కోట్ల దాకా గ్రాస్ తెచ్చి, 5సెంటర్స్ లో 100డేస్ ఆడింది. హిందీ 6కోట్లు, తెలుగు, తమిళ్ కల్పి 4కోట్ల గ్రాస్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా దేశభక్తి మూవీస్ లో అత్యుత్తమ మూవీగా నిల్చింది.