KGF సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
KGF Full Movie :సౌత్ ఇండియాలో ఓ కుదుపు కెజిఎఫ్ మూవీ. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఓ సెన్షేషన్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూడేళ్లు కష్టపడితే వచ్చిన ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీలో మాస్టర్ పీస్. వరల్డ్ వైడ్ 250కోట్ల గ్రాస్ తెచ్చింది. పైగా సీక్వెల్ కోసం మరింత ఆసక్తి పెరిగింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) కథకు ప్రధాన కారణం. టైటిల్ చూసాకే దీనిపై ఆసక్తి పుట్టింది. సహజంగానే పాన్ ఇండియా మూవీగా మారడానికి వీలయింది. పరిచయంలేని హీరో ఉన్నా, ఆర్టిస్టులు కొత్త వారైనా సరే బ్రహ్మాండంగా ఆదరించారు. ఇక స్క్రీన్ ప్లే చూస్తే బ్యాక్ అండ్ బ్యాక్ జంబ్లింగ్ స్క్రీన్ ప్లే. జిగ్ జాగ్ స్క్రీన్ ప్లే .. ఇలా అన్ని రకాలుగా నడుస్తుంది. కెజిఎఫ్ 2మీద ఎదురుచూపులు ఎంతలా ఉన్నాయో ఇటీవల రిలీజైన టీజర్ రికార్డ్స్ ఉదాహరణ
హీరోని చంపేయమని ఓ ప్రధాని ఆర్డర్ వేశారంటే, ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చో చూపించారు. దునియా కావాలన్న లక్ష్యంతో ఎదిగి, ఎలా ఎదిగాడో ఓ చిన్న క్యారెక్టర్ ద్వారా చెప్పించడం సూపర్భ్. లవ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ని పవర్ ఫుల్ గా చూపించిన సీన్స్ అదిరిపోతాయి. ఆ కాలం నాటి మనుషులు, దుస్తులు, వాడే వస్తువులు ఇలా అన్నింటా జాగ్రత్తలు తీసుకుని పక్కాగా సినిమా తీశారు. ఓ గరుడను చంపడం ద్వారా అక్కడున్న 20వేలమంది తన సైన్యంగా మారిపోతారు. కెజిఎఫ్ మీద మహామహుల కళ్ళు పడడంతో తర్వాత ఏమి జరుగుతుందన్న ఆసక్తి పెరుగుతుంది.
ఒక మామూలు కథకు బలమైన స్క్రీన్ ప్లే తో ఓ కొత్త లుక్ తెచ్చాడు ప్రశాంత్ నీల్. తల్లి సెంటిమెంట్ తో తీసిన సినిమాలన్నీ సంచలనంగా నిలిచాయి. ఈ సినిమాకు కూడా అదే ప్రాణం. ఎలాంటి వాళ్లైనా అమ్మతనానికి కనెక్ట్ అవుతాం. కెజిఎఫ్ లో ఇదే ఉంది. హీరో బతికితే అందరూ బతుకుతారని ఒకతను ప్రాణత్యాగం చేయడం గుండెను తాకుతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు వాయిస్, నటనతో హీరో ఎలివేషన్స్ పూనకం రప్పిస్తుంది. దాదాపు 20రకాల హీరో ఎలివేషన్ సీన్స్ ఇందులో కనిపిస్తాయి.
మ్యూజిక్, సాంగ్స్, డైలాగ్స్, కెమెరా, ఫైట్స్, ఎడిటింగ్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే , ఆర్ట్ వర్క్, .. ఇలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ అన్నీ సూపర్భ్. ఇక యష్ ఎవరు అని ఇండియన్ ఇండస్ట్రీ హీరో గురించి చర్చుకున్నారంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ తో సమానంగా యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కన్నడలో ఎవరికీ సాధ్యం కానీ హీరోయిజాన్ని చూపించాడు.