MoviesTollywood news in telugu

నేటిభారతం సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Neti bharatam Full Movie :టి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన నేటి భారతం అప్పట్లో ఓ సంచలనం. సుమన్ హీరోగా , విజయశాంతి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా లోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం గీతం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమా విశేషాల్లోకి వెళ్లేముందు కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే, అప్పట్లో ఒంగోలుస్. ఎస్. ఆర్ . శర్మ కాలేజీ అంటే ఓ క్రేజ్. డిగ్రీ చదివే పోకూరి బాబూరావుకు తన సీనియర్ టి కృష్ణ అంటే ఎంతో అభిమానం. బాబూరావు కూడా టి కృష్ణకు చాలా ఇష్టం. ప్రజానాట్యమండలిలో చురుగ్గా వ్యవహరించిన టి కృష్ణ మద్రాసు వచ్చి, గుత్తా రామినీడు దగ్గర తల్లీకూతుళ్లు మూవీకి అసెస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ సమయంలోనే మాదాల రంగారావు తో పరిచయం. టి కృష్ణ ఒంగోలు వచ్చేయగా, మాదాల మాత్రం యువతరం కదిలింది మూవీ తీసినప్పుడు బాబురావు, టి కృష్ణ తమవంతు సహకరించారు. మాదాల స్పూర్తితో తాము సినిమా చేయాలని భావించి, ఓ కథ తయారు చేసారు.

ఒంగోలులో చదివిన చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని కథ చేసినప్పటికీ చిరు ఇమేజ్ అప్పటికి పెరిగిపోయింది. దాంతో నేటి భారతం కథ రెడీ చేసారు. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ పెట్టారు. హీరో హీరోయిన్స్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసారు. అప్పటికే 4,5మూవీస్ చేసిన సుమన్ కల్సి డేట్స్ తీసుకున్నారు. ఇంతలో మాదాల నవోదయం షూటింగ్ జరుగుతుంటే టి కృష్ణ అక్కడికి వెళ్లారు. ముచ్చర్ల అరుణ, కవిత తో పాటు మరో అమ్మాయిపై షాట్స్ తీస్తున్నారు. భారతి పాత్రకు సరిపో తుందని ఫిక్స్ అయ్యారు.

1983జూన్ 15న షూటింగ్. మద్రాసులోనే మొత్తం షూటింగ్ 50రోజుల లోపే తీసేసారు. సమయానికి ఎవరూ దొరక్క వేరు శెనక్కాయలు అమ్మకునే వేజెళ్ళ రాజేశ్వరికి ప్రేమికుడిగా, భర్తగా టి కృష్ణ చేసారు. ఇక నాలుగు విలన్లు చీల్చి చెండాడానికి హీరోయిన్ చేత విలువిద్య వాడించారు. అయితే ఎడిటింగ్ లో తీసేసి, ఫ్లాష్ బ్యాక్ లో తీసేసారు. ముత్యాల సుబ్బయ్య కో డైరెక్టర్ గా చేసారు. ఈ సినిమా రిలీజయ్యాక, సినిమాకు అన్నీ వెనకుండి నడిపించిన ఘనత ముత్యాల సుబ్బయ్యదేనని టి కృష్ణ బహిరంగంగా ప్రకటించారు.

అంతేకాదు, ఈ మూవీలో కాంపౌడర్ వేషం ముత్యాల సుబ్బయ్య వేశారు. భారత మాతను నేను బందీనై పడివున్నాను అంటూ శ్రీ శ్రీ మంచం మీద ఉండి రాసిన ఈ మూవీలోని ఆఖరి సాంగ్ హైలెట్. సాంగ్ లో మార్పులు కావాల్సి వస్తే, అప్పటికే మూడు పాటలు రాసిన అదృష్టదీపక్ శ్రీశ్రీ దగ్గరకు వెళ్లి అతికష్టం మీద పూర్తిచేశారు. మానవత్వం పరిమిళించే సాంగ్ ని సితార విద్వాంసుడు రవిశంకర్ ప్రసాద్ బిట్ ఆధారంగా చక్రవర్తి స్వరపరిచారు. స్లీవ్ లెస్ జాకెట్ తో విజయశాంతి పట్టుచీర కట్టుకుని వచ్చింది. అయితే క్లాసికల్ సాంగ్ కావడంతో తేడా కొట్టింది. దాంతో చీరకొంగుని కప్పుకోమని టి కృష్ణ సలహా ఇవ్వడంతో సాంగ్ పూర్తయింది. మోదుకూరి జాన్సన్ మాటలు రాసారు. వేశ్య గృహం నడిపే పాత్రను ఎస్ వరలక్ష్మిచేత అతికష్టం మీద టి కృష్ణ ఒప్పించి చేయించారు.

విజయశాంతికి ఇది 11వ సినిమా. టి కృష్ణ లేకుంటే నేనొక సాధారణ హీరోయిన్ గా మిగిలిపోయే దాన్నేమో అని విజయశాంతి ఓసారి చెప్పుకొచ్చారు. బాబురావు లక్ష రూపాయలతో సినిమా స్టార్ట్ చేసి, తరచూ ఒంగోలు వచ్చి ఫ్రెండ్స్ దగ్గర అప్పుచేసి పట్టుకెళ్ళేవారు. విషయం తండ్రి గ్రహించి , ధైర్యం ఇచ్చారు. బ్యాంకు లో పనిచేయడం వలన తన పేరు కాకుండా తన తమ్ముడు వెంకటేశ్వరరావు పేరు వేశారు.

14సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఒంగోలులో జరిగిన 100రోజుల వేడుకకు ఎం ఎస్ రెడ్డి, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటివారు హాజరయ్యారు. చక్రవర్తి అందుకున్న తొలి నంది అవార్డు ఈ సినిమాకే కావడం విశేషం. బెస్ట్ డైరెక్టర్ గా టి కృష్ణ, బెస్ట్ యాక్టర్ గా పి ఎల్ నారాయణ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా వచ్చి 25ఏళ్ళు దాటిన ఇందులో ఎత్తిచూపిన సమస్యలు ఇంకా చేరగలేదు. ఇక బాబూరావు రెండు సినిమాల తర్వాత బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసేసారు.