నల్ల జామను ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Black guava fruit benefits In Telugu : జామకాయ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు జామ పండును చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే జామ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆకుపచ్చ రంగులో ఉండి తెలుపు లేదా గులాబీ రంగు గుజ్జును కలిగి ఉండే జామపండును మాత్రమే మనం చూసాం.
అయితే జామ పండులో మరో రకం కూడా ఉంది. అదే నల్ల జామపండు. దాదాపుగా మనలో చాలామందికి ఈ నలుపు రంగులో ఉండే జామపండు గురించి తెలియదు. ఈ నల్ల రంగులో ఉండే జామకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నల్ల జామకాయ తొక్క నల్లగా ఉండి లోపల ఎర్రటి గుజ్జులు కలిగి ఉంటుంది.
సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. నల్ల జామపండులో విటమిన్ ఎ, బి, సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా మినరల్స్ పుష్కలంగా ఉండే నల్ల జామ తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు.
దీనితో పాటు, శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి నల్ల జామను తినవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ జామ పండును తినటం వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం మరియు పైల్స్తో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఐరన్ మరియు కాల్షియం సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ నల్ల జామను తింటే రక్తంలో హోమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడతారు. చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా ఉంచి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అంది… వ్యాధినిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
ఈ జామ రంగు నలుపు రంగు మాత్రమే కాదు… చెట్టు, పువ్వులు మరియు ఆకులు కూడా లేత నలుపు రంగులో ఉంటాయని తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకు ఎన్నో రకాల పండ్లు లభ్యం అవుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా లభించే పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.