ఈ ఆకులను, గింజలను మరిగించి జుట్టుకి పట్టిస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు ఉండవు
Hair Loss Home Remedies In telugu : జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ఒకసారి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. దాంతో మనలో చాలా మంది ఈ సమస్యలు రాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు.
అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఇంటిలో సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. 5 లేదా 6 మందార ఆకులను మరియు నాలుగు మందార పూలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసుల నీటిని పోసి… నీరు వేడెక్కాక మందార ఆకులు, పువ్వులు వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల కలోంజి సీడ్స్ వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో నీటిని వడగట్టాలి. ఈ నీటిని పూర్తిగా చల్లార్చాలి. .
చల్లారిన ఈ నీటిలో ఒక స్పూన్ వేప నూనె వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ నీటిని స్ప్రే చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి గంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతాయి.
మందార ఆకులు, పువ్వులలో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే కలోంజీ సీడ్స్ కూడా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఈ రెమిడీ ఫాలో అవటం వలన జుట్టు రాలే సమస్య, చుండ్రుల సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.