అల్లంతో ఈ పొడిని కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు… ముఖ్యంగా ఈ సీజన్ లో…
Healthy DRink Winter In telugu : ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మనం ఏ. మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా ఎన్నో రకాల సమస్యలు చుట్టు ముట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి వస్తూ ఉంటాయి.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే దాదాపుగా చలికాలంలో వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త సమయం కేటాయిస్తే సరిపోతుంది. ముందుగా ఆరంగుళం అల్లం ముక్కని తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి మెత్తగా దంచుకోవాలి.
ఆ తర్వాత పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక దంచి పెట్టుకున్న అల్లం వెయ్యాలి. ఆ తర్వాత అర స్పూన్ అశ్వగంధ పొడి, అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టైనర్ సహాయంతో పాలను వడగట్టాలి. .
ఈ పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలల్లో తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్న. వారు తేనె లేకుండా తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వలన మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి., ఆందోళన వంటి సమస్యలు ఉండవు. అలాగే ఈ సీజన్లో వచ్చే సమస్యలను తగ్గించడానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి ఉండవు.
శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. ఒళ్ళు నొప్పులు., మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శ్వాస సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఈ చలికాలంలో రోజు విడిచి రోజు ఈ డ్రింక్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. కాబట్టి ఈ చలికాలంలో తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.