ఈ పాలను తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు
Nidra lemi Tips in telugu : ఈ రోజుల్లో చాలా మందికి నిద్రలేమి సమస్య ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నిద్రలేమి సమస్యను అశ్రద్ధ చేస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, గందరగోళం, అతిగా తినటం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా నిద్రలేమి సమస్య కారణంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది దాంతో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఇప్పుడు చెప్పే ఈ పాలను రాత్రి పడుకొనే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది.
ఈ పాలను తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ముందుగా గసగసాలను పాన్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అంటే గసగసాలను డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత బాగా వేగిన గసగసాలను మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. .
ఆ తర్వాత జాజికాయను కూడా పొడిగా తయారు చేసుకోవాలి. గసగసాల పొడి, జాజికాయ పొడి మార్కెట్లో లభ్యమవుతాయి. అయితే మన ఇంటిలో తయారు చేసుకుంటేనే మంచిది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో పావు స్పూన్ గసగసాల పొడి., 1/4 స్పూన్ లో సగం జాజికాయ పొడి వేసి బాగా కలిపి రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. .
ఈ విధంగా ప్రతిరోజూ తాగుతూ ఉంటే ఒత్తిడి, అలసట ఏమీ లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. జాజికాయ., గసగసాలలో ఉన్న లక్షణాలు నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. నిద్ర బాగా పడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం విషయంలో నిద్ర అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.