బాదం పప్పు Vs వాల్ నట్స్… ఏది ఆరోగ్యానికి మంచిది… నమ్మలేని నిజాలు
Almond and walnuts Health benefits In telugu : బాదం పప్పు, వాల్ నట్స్ రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాల్ నాట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. మిగతా నట్స్ తో పోలిస్తే వాల్ నట్స్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
బాదం పప్పులో కాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. అవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. రోజులో రెండు వాల్ నట్స్, నాలుగు బాదం పప్పులను తినవచ్చు. వీటిని దాదాపుగా 5 గంటల పాటు నానబెట్టి తొక్క తీసి తింటే వంద శాతం పోషకాలు అందుతాయి.
ఇక బాదంలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన మెదడు కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. బాదంలో ఉండే ప్రోటీన్ మెదడు కణాలను సరిచేయడానికి మరియు మెదడు యొక్క అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. బాదంలో ఉండే జింక్ శరీరంపై ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసే సెల్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మెదడుకు అత్యంత ఆరోగ్యకరమైన నట్స్ లోవాల్ నట్స్ మొదటి స్థానంలో ఉంటుంది. వాల్ నట్స్ లో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి మరియు మెదడు యొక్క మెరుగైన పనితీరుకు సహాయపడతాయి. అంతేకాక ఏకాగ్రత, సమాచార ప్రాసెసింగ్ వేగం మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యానికి అల్జీమర్స్ సమస్యను తగ్గించటానికి బాదం కంటే వాల్ నట్స్ బాగా సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు బాదం తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్‌తో పాటు శరీరంలోని గ్లూకోజ్ పెరుగుదలను తగ్గించడంలో సహాయ పడతాయి.
వాల్ నట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లక్షణాలు ఉండుట వలన డయాబెటిస్ నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల రక్తప్రవాహంలో చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేలా చూస్తాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను తగ్గించే ఇన్సులిన్ నిరోధకతను నిర్మించడంలో సహాయపడుతుంది.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి వాల్ నట్స్ తో పోలిస్తే బాదం పప్పు మంచిది. గుండె ఆరోగ్యానికి వాల్ నట్స్ బాగా సహాయపడతాయి. బాదంలో ఉన్న పోషకాలు కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. బాదం పప్పుతో పోలిస్తే వాల్ నట్స్ ఎక్కువ మేలును చేస్తాయి. కాబట్టి బాదం పప్పు, వాల్ నట్స్ రెండింటినీ తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.