Kitchenvantalu

రక్తహీనత బలహీనత పోగొట్టి ఎంతో బలాన్నిచ్చే బలమైన లడ్డు… రోజుకి 1 చాలు

Dry Fruit Laddu In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవాలన్నా… ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఇప్పుడు చెప్పే లడ్డు రోజుకి ఒకటి తింటే సరిపోతుంది. ఈ లడ్డులో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

రక్తహీనత, శారీరక బలహీనత, అలసట, నీరసం వంటివి ఏమి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ లడ్డు తయారుచేసుకోవటం చాలా సులువు. మిక్సీ జార్ లో ఒక కప్పు ఎండిన కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Dates seeds health benefits in Telugu
ఆ తర్వాత ఒక కప్పు ఎండు ఖర్జూరం ముక్కలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు Dry Fruits (పిస్తా, జీడిపప్పు,బాదం మూడు కలిపి) వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి మిక్సీ చేసిన పొడులను వేసి మూడు నుంచి 4 నిమిషాలు డ్రై గా వేగించాలి.
Diabetes patients eat almonds In Telugu
ఈ వేగిన పొడులను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. మరల అదే పాన్ లో పావు కప్పు గోదుమపిండిని వేసి వేగించాలి. ఆ తర్వాత అరకప్పు నెయ్యి వేసి బాగా వేగించి పొడులను వేసిన బౌల్ లో వేయాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు బెల్లం వేసి… కరిగాక పైన తయారుచేసుకున్న పొడులను వేసి… ఆ తర్వాత పావు కప్పు నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూలు తయారుచేసుకోవాలి.
Is pista good for diabetes In Telugu
ప్రతి రోజు ఒక లడ్డును తీసుకోవాలి. ఈ లడ్డును ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అలాగే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు. ఈ లడ్డు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ లడ్డూలు దాదాపుగా పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.