ఈ సీజన్ లో లభించే ఈ పండును తింటున్నారా….ఊహించని ఎన్నో ప్రయోజనాలు
Narinja health Benefits in telugu : ఈ సీజన్ లో నారింజ పండ్లు చాలా విరివిగా లభ్యమవుతాయి. కానీ కమలా పండ్లను ఇష్టపడినట్లుగా నారింజ పండ్లను పెద్దగా ఇష్టపడరు. ఆకుపచ్చ రంగులో ఉండే నారింజ పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ సీజన్లో దొరికే ఈ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే నారింజలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే నారింజ పండ్లను నిర్లక్ష్యం చేయకుండా తింటారు. నారింజలో ఉన్న పోషకాల విషయానికి వస్తే… తేమ, కాల్షియం, మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, భాస్వరము, క్రొవ్వు, ఇనుము, సేంద్రియ లవణాలు, విటమిన్ – ఏ, విటమిన్ – బి1, విటమిన్ సి వంటివి సమృద్దిగా ఉంటాయి.
నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏమి ఉండవు. అలాగే ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది.
నారింజలో ఉండే కాల్షియం ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. నారింజ పండులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా నారింజ పండు బాగా సహాయపడుతుంది. నారింజ పండు యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. విటమిన్ a సమృద్దిగా ఉండుట వలన కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఈ పండును కోసిన వెంటనే తినాలి. ఆలస్యమైనకొద్దీ సి-విటమిన్ ఆవిరైపోతుంది. గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. కాబట్టి ఈ సీజన్ లో విరివిగా లభించే నారింజ పండ్లను తిని ఇప్పుడు చెప్పిన అన్నీ రకాల ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.