ఉల్లికాడలను తింటున్నారా…వాటిలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే…అసలు వదిలిపెట్టరు
Spring Onions Health benefits In telugu : చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే సీజన్ లో విరివిగా లభించే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మనం ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి ఆహారాలలో Spring Onion ఒకటి.
మనం ప్రతి రోజు కూరల్లో ఉల్లిపాయను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే spring Onions లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ని ఉల్లికాడలు అని పిలుస్తారు.
కొంతమంది ఉల్లికాడలను పెద్దగా ఉపయోగించరు. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం తప్పనిసరిగా వాడటం ప్రారంభిస్తారు. ఉల్లికాడలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి DNA ను రక్షించటమే కాకుండా ఆరోగ్యకరమైన కణాలను నిర్మించటంలో సహాయ పడుతుంది.
ఉల్లికాడలలో సల్ఫర్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడి ఎముకలను దృఢంగా చేస్తుంది. అలాగే విటమిన్ K ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది.
దాంతో కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లికాడలలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన శ్వాసకోశ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తేలికగా బయటకు పంపటమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు, దగ్గు, జలుబు వంటివి రాకుండా కాపాడుతుంది.
ఉల్లికాడలో కెరోటిన్ ఉండుట వలన కంటిశుక్లం వంటి సమస్యలు లేకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఉల్లికాడను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇది మన శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు కడుపు ఉబ్బరం,గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమి లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఉల్లికాడలో విటమిన్ K మరియు సల్ఫర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో మెరుగైన రక్త ప్రసరణతో పాటు, మానసిక ఒత్తిడి మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.