బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన మూవీస్…ఎన్ని హిట్ అయ్యాయో…?
Balakrishna Duel Role Movies In Telugu : సాదరణంగా మనలో చాలా మందికి తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలానే ఉంటుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం.
తండ్రి ఉండగానే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమాలతో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం కూడా చేసి అలరించాడు. బాలయ్య తొలిసారి అపూర్వ సహోదరులు మూవీలో డబుల్ రోల్ చేసాడు. 1986లో విడుదలైన ఈ సినిమాలో బాలయ్య నటన అద్భుతం. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్స్ గా చేసారు. ఇక 1988లో వచ్చిన రాముడు భీముడు లో బాలయ్య ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. కె మురళీమోహన్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాధ,సుహాసిని హీరోయిన్స్ గా చేసారు.
ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ 1991లో రిలీజయింది. తొలిభాగంలో హరిచంద్రుడి పాత్రలో, రెండవ భాగంలో దుష్యంతుడి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడు. ఈ మూవీకి ఎన్టీఆర్ దర్శకుడు కావడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఆదిత్య 369మూవీ 1991లో వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ లో,అదే కాలంలో వెళ్లి పలకరించే సాధారణ మానవుడి గెటప్ లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి అలరించాడు. ఇళయరాజా సంగీతం సినిమాకు ఎసెట్. మోహిని హీరోయిన్.
పోలీసాఫీసర్ గా, సాధారణ పౌరుడిగా రెండు పాత్రల్లో నటించిన బాలయ్య ‘మాతో పెట్టుకోకు’ మూవీ 1995లో రిలీజయింది. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీని ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసారు. ఇక 1996లో రిలీజైన పౌరాణిక సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం లో కృష్ణుడుగా, అర్జునుడుగా బాలయ్య నటించాడు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసారు. అన్నయ్య,తమ్ముడి పాత్రలో బాలయ్య నటించిన పెద్దన్నయ్య మూవీ మంచి హిట్ అయింది. శరత్ డైరెక్ట్ చేసారు.
కొత్త తరహాలో బాలయ్య నటించిన సుల్తాన్ మూవీ 1999లో రిలీజయింది. ఉగ్రవాదిగా, ఫారెస్ట్ ఆఫీసర్ గా మంచి నటన కనబరిచాడు. దీనికి కూడా శరత్ డైరెక్షన్ చేసారు. వివి వినాయక్ డైరెక్షన్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన చెన్నకేశవరెడ్డి మూవీ 2002లో వచ్చింది. టైటిల్ రోల్ తో పాటు, పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య డబుల్ యాక్షన్ చేసాడు. శ్రేయ,టబు హీరోయిన్స్ .అల్లరి పాత్రలో,పిడుగు పాత్రలో డ్యూయల్ రోల్ చేసిన అల్లరి పిడుగు మూవీ లో బాలయ్య బాగానే నటించాడు.
తాత, మనవడి పాత్రల్లో బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ2008లో వచ్చింది. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్, అనుష్క అందాలు, వైవిఎస్ చౌదరి దర్శకత్వం కుదిరాయి. శ్రీకష్ణుడుగా, భక్తుడు పుండరీక రంగనాధుడిగా బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన పాండురంగడు మూవీ కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చింది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ 2008లో రిలీజయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన సింహా మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
పగ, ప్రతీకారం నేపథ్యంలో 2010లో వచ్చిన ఈ మూవీలో నయనతార,స్నేహ ఉల్లాల్ హీరోయిన్స్. డాక్టర్ గా,ప్రొఫెసర్ గా బాలయ్య నటించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో సినిమా యాక్టర్ గా, మిలటరీ ఆఫీసర్ గా బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన పరమవీరచక్ర మూవీ 2011లో వచ్చింది.
పరుచూరి మురళి డైరెక్షన్ లో 2012లో వచ్చిన అధినాయకుడు మూవీలో బాలయ్య ఏకంగా మూడు పాత్రల్లో నటించాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య రెండు పాత్రల్లో నటించిన లెజెండ్ మూవీలో జగపతి బాబు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.