కేవలం 5 రూపాయిల ఖర్చుతో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Hair Fall Home Remedies In telugu : సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, ఒత్తిడి, రసాయనాలు ఉన్న షాంపూలను ఎక్కువగా వాడటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.
జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. దీని కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగే లాగా చేసుకోవచ్చు.
దీనికోసం ఒక గిన్నెలో 150 గ్రాముల కొబ్బరి నూనె పోసి దానిలో మూడు తమలపాకులు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి కట్ చేసి వేయాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులను వేయాలి. దీనిని పొయ్యిమీద పెట్టి బాగా మరిగించాలి. అంటే మనం తీసుకున్న పదార్థాలు బాగా వేగే దాకా మరిగించాలి.
ఆ తర్వాత ఈ నూనెను వడగట్టి సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను ప్రతిరోజు తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తలలో వెంట్రుకలకు రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఈ నూనెను మనం రెగ్యులర్ గా ఉపయోగించే నూనెకు బదులు వాడితే సరిపోతుంది.
ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా ఈ నూనెను తయారుచేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.