మహేష్ బాబు పోకిరికి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమైందో చూడండి
Mahesh Babu pokiri Movie in Telugu : మహేష్ బాబు సూపర్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని…ఒక పక్క సినిమాల్లో నటిస్తూ…మరో పక్క సినిమాలను నిర్మిస్తు…అలాగే వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్రను వేస్తున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్. నిజానికి ఈ సినిమాకు ముందు మహేష్ వేరు,ఈ మూవీ తర్వాత మహేష్ రేంజ్ వేరు అన్నట్లుగా మారిపోయింది. అయితే అదే సమయంలో మరికొందరి స్టార్ హీరోల మూవీస్ కూడా రిలీజై, ఈ మూవీపై ఎఫెక్ట్ చూపింఛాయో అనే విషయంలోకి వెళ్తే, 2006ఏప్రియల్ 28న పోకిరి రిలీజయింది. మహేష్ నటన,అతడెవరో చివర చూపించి సస్పెన్స్ కి తెరదించడం వంటి విషయాలు ఆకట్టుకోగా,ఇలియానా గ్లామర్ ప్లస్ పాయింట్ అయింది. ఇక మణిశర్మ మ్యూజిక్ అదిరింది. 200సెంటర్స్ లో 100డేస్ ఆడి కలెక్షన్స్ వర్షం కురిపించింది.
ఈ సినిమా మర్నాడే బాలయ్య నటించి వీరభద్ర మూవీ రిలీజయింది. బాలయ్య కొత్త గెటప్ లో కన్పించాడు. సదా,తనుశ్రీ దత్తా హీరోయిన్స్ గా గ్లామర్ తో పండించారు. అయితే పోకిరి ముందు ఆగలేకపోయినా, 42సెంటర్స్ లో 100ఆడింది. ప్రభాస్ నటించిన పౌర్ణమి మూవీ పోకిరీకి ముందు వారం రోజుల గ్యాప్ లో రిలీజయింది. ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ మూవీకి ప్రభుదేవా డైరెక్టర్. డాన్స్ ప్రధానాంశంగా వచ్చిన ఈ మూవీ లో త్రిష, ఛార్మి హీరోయిన్స్ గా చేసారు. అయినా ఈ మూవీ ఆకట్టుకోలేదు సరికదా,వారం తర్వాత వచ్చిన పోకిరితో పౌర్ణమి కలెక్షన్స్ ఆగిపోయాయి.
ఇక పోకిరి రిలీజైన 5రోజులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం మూవీ రిలీజయింది. 5సెంటర్స్ లో 100రోజులు ఆడిన ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. మీరా చోప్రా హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈవీవీ సత్యనారాయణ దర్శక నిర్మాతగా వ్యవహరించిన కితకితలు మూవీ సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయింది. అల్లరి నరేష్ హీరోగా చేసిన ఈ మూవీలో గీతా సింగ్ లావుగా ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. మంచి మెసేజ్ ఇచ్చారు. అన్ని సెంటర్స్ లో 50రోజులు ఆడడమే కాకుండా 9సెంటర్స్ లో 100రోజులు ఆడింది.