MoviesTollywood news in telugu

గుప్పెడంత మనసు సీరియల్ దేవయాని రియల్ లైఫ్…భర్త ఎవరో తెలుసా?

Star Maa Guppedantha manasu serial devayani : స్టార్ మాలో ప్రసారం అయ్యే సీరియల్స్ అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయి. తెలుగు సీరియల్స్ లో బాగా ఆకట్టుకుంటున్న వాటిలో గుప్పెడంత మనసు మొదటి నుంచి మంచి పాపులార్టీ తెచ్చుకుంది. ఈ సీరియల్ మొదలైన కొద్దిరోజుల్లోనే జనానికి బాగా కనెక్ట్ అయింది.

అందుకే ఈ సీరియల్ ని బాగా ఆదరిస్తున్నారు. ఇక ఇందులో నటీనటులు తమ నటనతో, అందంతో ఆకట్టుకుంటున్నారు. కార్తీకదీపం సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ఆలాంటి క్రేజ్ ఈ సీరియల్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్ లో నెగెటివ్ రోల్ దేవయాని పాత్రలో ఒదిగిపోయిన నటి పేరు మాధవి.

ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టిన మిర్చి మూవీలో నటించిన మాధవికి మిర్చి మాధవిగా పేరొచ్చింది. ఏపీలోని గుంటూరులో జూన్ 9న జన్మించింది. ఈమె భర్త బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా పనిచేసిన ఈమె ఆసమయంలో యానవర్సిడే కి ఓ కొరియోగ్రాఫర్ రావడం, మాధవిని చూసి ఇండస్ట్రీకి వస్తారా అని అడగడంతో ఆవిధంగా ఇండస్ట్రీలోకి వచ్చింది.

అయితే జి తెలుగులో ప్రసారమైన త్రిసూలం సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్ తోనే బుల్లితెర ఆడియన్స్ ని తన నటనతో ఆకట్టుకుని బాగా దగ్గరైంది. చిన్నారి, కంటే కూతుర్నే కనాలి, కథలో రాజకుమారి వంటి సీరియల్స్ నటించిన ఈమె సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. 100%లవ్,శతమానం భవతి,మిర్చి,మహానాయకుడు,గద్దలకొండ గణేష్ వంటి మూవీస్ లో చేసింది.

అభిషేకం,గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటిస్తూ,ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఈ సీరియల్ ప్రేక్షక ఆదరణతో సక్సెస్ గా ముందుకు సాగుతుంది.