1 స్పూన్ డయాబెటిస్, అధిక బరువు, కీళ్ల నొప్పుల సమస్యలు అసలు ఉండవు
Joint Pains Home Remedies in Telugu : ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు చెప్పే రెమిడీ సమస్యలు లేని వారు కూడా వారంలో రెండు సార్లు తీసుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యలు రావు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడే అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. మన వంటింటిలో ఉండే కొన్ని పదార్ధాలను ఉపయోగించి ఈ రెమిడీని చాలా సులువుగా చేసుకోవచ్చు. మన వంటింట్లో రెగ్యులర్ గా అల్లం ప్రతి రోజు ఉపయోగిస్తుంటాం.
అల్లం చిన్న ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి. అల్లం తురుము ఒక స్పూన్ ఉండేలా చూసుకోవాలి. ఒక బౌల్లో ఒక స్పూన్ అల్లం తురుము ఒక స్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
అధిక బరువు కీళ్ల నొప్పులు డయాబెటిస్ వంటి వాటిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా చేస్తుంది. తేనె,అల్లం ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం కోసం కాస్త సమయాన్ని కేటాయించి ఇంటి చిట్కాలను ఫాలో అయితే సమస్య చిన్నగా ఉన్నప్పుడూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అదే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా మంచి ప్రయోజనం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.