MoviesTollywood news in telugu

మెగా హీరో వరుణ్ తేజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Mega Hero Varun Tej Life Style : మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1990లో పుట్టిన వరుణ్ తేజ్ బీకాం పూర్తి చేసి సినిమాల మీద ఆసక్తితో ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

నటన పరంగా ముకుంద సినిమాకు మంచి మార్కులే పట్టాయి. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాకు 74 లక్షల పారితోషికం తీసుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్, కంచె,లోఫర్, అంతరిక్షం, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్ 2, f 3 వంటి సినిమాలు చేశాడు.

వీటిలో కొన్ని సక్సెస్ అయితే… కొన్ని డిజాస్టర్ గా మారాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కధకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టంమట. వరుణ్ తేజ్ తన సంపాదనతో నాలుగు కార్లు, గాయత్రి హిల్ లో ఓ గెస్ట్ హౌస్ కొనుక్కున్నాడట.

ప్రస్తుతం వరుణ్ మణికొండలోని 9 కోట్ల విలువ చేసే విల్లాలో ఉంటున్నాడు. వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చినా సరే… వరుణ్ తేజ్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు.