Healthhealth tips in telugu

ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ కాయలను అసలు మిస్ చేసుకోవద్దు….ఎందుకంటే

Parika kayalu Health benefits In telugu : శీతాకాలంలో కురిసే మంచు చల్లదనానికి అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దాని నివారణకు అవసరమయ్యే ఆహారాన్ని కూడా మనకు ప్రక్రుతి అందిస్తుంది. వాటికీ సంబంధించి ఈ రోజు పరిక్కాయలు గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిక్కాయల చెట్లు పల్లెల్లో రోడ్లపక్కన, పొలాల గట్ల మీద పెరుగుతాయి.
pariki kayalu
ఈ సీజన్ లో ఈ పరిక్కాయలు చాలా ఎక్కువగా లభిస్తాయి. పరిక్కాయలు చాలా చిన్నవిగా బటానీల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోరవి ఎరుపు రంగులోను, బాగా మాగినవి నలుపు రంగులోను ఉంటాయి.వీటి రుచి పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఈ కాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
parika kayalu
ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా పెరుగుతాయి. కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. ఈ కాయల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నవంబర్ నుండి మార్చి వరకు విరివిగా లభ్యం అవుతాయి. ఈ పండ్లను సేకరించి పల్లెటూరిలో ఉండేవారు పట్నం వెళ్లి అమ్ముతూ ఉంటారు.

ఇలా పట్నం వాసులకు కూడా ఈ పండ్ల రుచి తెలిసింది. ఈ పండ్లను ఒక్కసారి తింటే మరల తినాలని అనిపిస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్ లో దొరికే ఈ పరిక్కాయలను అసలు మిస్ చేసుకోకుండా తినాలి. పరిక్కాయలలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు,మెదడు చురుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది.

ఈ పరిక్కాయలను తరచుగా తింటూ ఉంటే ఆరోగ్య సమస్యలు దారి చేరవు. ఈ ఆధునిక కాలంలో ఇలా సీజన్ లో వచ్చే పండ్లను తినకపోవడం వలన ఎన్నో ఆరొగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలాంటి పండ్లను అసలు మిస్ చేసుకోకుండా తింటూ ఉండాలి.
Diabetes diet in telugu
ఈ పండ్లను తరచుగా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు,మధుమేహం వంటి సమస్యలు రావని ప్రకృతి వైద్యులుచెప్పుతున్నారు . రక్తపోటుతో బాధపడేవారికి పరిక్కాయలు చాలా సహాయాపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి హెల్ప్ చేస్తుంది. అయితే పండిన కాయలను కాకుండా పచ్చి కాయలను తినాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.